‘సరిపోదా శనివారం’మళ్లీ అదే పొరపాటా? అబ్బే అదేం లేదు
'సరిపోదా శనివారం' సినిమాను శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నాని 31వ సినిమా ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram)రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ అప్‌డేట్ ఇచ్చారు నాని. సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయని, సినిమా నిడివి 2: 50 గంటలని (Saripodhaa Sanivaaram Runtime) తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో విడుదల చేశారు.
అందులో నాని రన్‌టైమ్ ఎంతో చెప్పగానే ‘అంటే..’ అంటూ ‘అంటే.. సుందరానికీ!’ సినిమా నిడివిని గుర్తుచేసే ప్రయత్నం చేశారు ఎస్.జె సూర్య. ‘అంటే.. కాదు సరిపోదా శనివారం. ఇది యాక్షన్ ఫిల్మ్’ అని నాని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘లవ్‌స్టోరీ కూడా’ అంటూ హీరోయిన్ ప్రియాంక మోహన్ సందడి చేశారు. సంబంధిత వీడియోను రీ పోస్ట్ చేసిన నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘ఈసారి లెక్కలన్నీ సరిపోతాయ్’ అంటూ నాని అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించేలా క్యాప్షన్ పెట్టింది. అయితే కావాలని అన్నట్లుగా రన్ టైమ్ పెంచటం ఎందుకు మళ్లీ అదే పొరపాటు ఎందుకు చేస్తున్నారు అని కొందరు సోషల్ మీడియా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇక ‘అంటే.. సుందరానికీ!’, ‘సరిపోదా శనివారం’.. రెండింటికీ దర్శకుడు వివేక్ ఆత్రేయ. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ‘అంటే..’ సినిమా నిడివి 2:56 గంటలు. కంటెంట్ బాగున్నా రన్‌టైమ్ విషయంలో ప్రేక్షకులు కాస్త అసంతృప్తి చెందారు. ఆరు నిమిషాల తేడాతో తాజా చిత్రం రానుండడం గమనార్హం. మిగిలిన రోజుల్లో శాంతంగా ఉండే హీరో శనివారం ఎందుకు కోపం ప్రదర్శిస్తాడనే కథాంశంతో రూపొందిందీ సినిమా.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దసరా మరియు హాయ్ నాన్న వంటి హిట్ల తర్వాత, నాని ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని ఆశ పడుతున్నారు.
సరిపోదా శనివారం రన్ టైం 170 నిమిషాల 50 సెకన్లుగా ఉంది, అంటే దాదాపు 3 గంటలు. నాని గతంలో కూడా అంటే సుందరానికి అనే సినిమాతో ఎక్కువ రన్ టైమ్ చేసినా, అది పూర్తిగా క్లిక్ అవ్వలేదు. అయితే, రన్ టైం ఎక్కువగా ఉన్నా కథనం ఎక్కడా లాగ్ కాకుండా ఉంటే సినిమాకి సక్సెస్ వస్తుందని యానిమల్ , కల్కి వంటి సినిమాలు రుజువు చేశాయి.
మరి ‘సరిపోదా శనివారం’కి ఈ రన్ టైమ్‌తో ప్రేక్షకులని బోర్ కాకుండా కట్టిపడేస్తారేమో చూడాలి.
‘సరిపోదా శనివారం’సినిమాలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ‘దసరా’ లాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న మాస్, రగ్డ్ మూవీ తర్వాత.. ‘హాయ్ నాన్న’ అనే క్లాస్, ఫీల్ గుడ్ స్టోరీని నాని ఎంచుకున్నారు. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ లాంటి డిఫరెంట్ యాక్షన్ జోనర్ కథను ఎంపిక చేసుకున్నారు.