నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం 'వి'. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సుదీర్ బాబు కూడా నటిస్తున్నాడు. ఇద్దరు హీరోలతో ఇంద్రగంటి ఏం ప్లాన్ చేస్తున్నాడనే విషయంలో కొంతవరకు క్లారిటీ వచ్చిందనే చెప్పాలి.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నాని పక్కా విలన్ గా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. అయితే అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుందట. కథ ప్రకారం సినిమాలో నాని మర్డర్లు చేస్తూ... చిన్న చిన్న క్లూలు వదులుతూ ఉంటాడట. వాటి ఆధారంగా సుదీర్ కుమార్ అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడట.

అయితే నాని ఎందుకు అలా మర్డర్లు చేస్తున్నాడనే దాని వెనుక మరో స్టోరీ ఉంటుందట. ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమాను రూపొందించనున్నారు.

కొన్ని రోజులు హైదరాబాద్ లో షూటింగ్ జరిపి ఆ తరువాత బ్యాంకాక్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా  కనిపించనున్నారు.