నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించనున్నాడు. ఈ సినిమా కథ కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం.

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రామన్ లంబా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇండియా తరఫున మ్యాచ్ లో పాల్గొన్న సమయంలో బాల్ వచ్చి అతడి ముఖంపై తగలడంతో టెంపొరల్ బోన్ దెబ్బ తిని కోమాలోకి వెళ్లిపోయాడు.

అలా మూడు రోజులుకోమాలో ఉన్న తరువాత అతడు చనిపోయాడు. ఈ సంఘటనను సినిమా కథలో క్లైమాక్స్ గా చూపించబోతున్నారు. అంటే కథ ప్రకారం సినిమాలో హీరో చనిపోతాడన్నమాట. ఈ సినిమాలో నాని మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.

అతడి చిన్నతనం నుండి కథ మొదలవుతుందని సమాచారం. యంగ్ రంజీ ప్లేయర్ గా, ఒక తండ్రిగా నాని కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సమ్మర్ లో సినిమాను విడుదల చేయనున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది.