Asianet News TeluguAsianet News Telugu

నాని ‘జెర్సీ’.. ఫిల్మ్ నగర్ టాక్ !

నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జెర్సీ` ఈనెల 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ట్రైలర్ రిలీజైన రోజు నుంచీ ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. ఏషియానెట్ మీకు ఎక్సక్లూజివ్ గా ఈ చిత్రం టాక్ అందిస్తోంది.

Nani's Jersey movie filmnagar talk
Author
Hyderabad, First Published Apr 17, 2019, 4:30 PM IST

నాని హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జెర్సీ` ఈనెల 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ట్రైలర్ రిలీజైన రోజు నుంచీ ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు అవుతూ వచ్చాయి. ఏషియానెట్ మీకు ఎక్సక్లూజివ్ గా ఈ చిత్రం టాక్ అందిస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం...ఈ మధ్యకాలంలో నాని చేసిన చాలా సినిమాల కన్నా ఈ సినిమా బెటర్ గా ఉండనుంది. క్రికెట్ బ్యాక్ గ్రౌండ్ లో జరిగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. నాని పర్శనల్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోయే ఈ కథ నాని మార్కెట్ ని జస్టిఫై చేస్తుందనటంలో సందేహం లేదు. 

ఇందులో నాని అర్జున్‌ అనే క్రికెటర్‌ పాత్రలో నటించారు. 1990ల కాలం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఫస్టాఫ్ ..హీరో యూత్, రొమాంటిక్ లైఫ్ ని డీల్ చేస్తూ సాగుతుంది. సెకండాఫ్ పూర్తిగా ఎమోషన్ గా, అతని స్ట్రగుల్స్ ని చూపుతుంది. కథగా కన్నా కథనం మీద ఎక్కువగా ఆధారపడి తీసిన సినిమా ఇది. స్లో నేరేషన్ లో సాగే ఈ సినిమా క్లైమాక్స్ నిలబెట్టేస్తుంది. 

ఈ సినిమాలో క్రికెట్ మ్యాచెస్ .చక్కగా చూపించారు. ఆ ఇంటెన్స్ చూసే ప్రేక్షకులు అనుభవించేలా డీల్ చేసారు. ఓవరాల్ గా ఇది ఫ్యామిలీస్ కు, క్రికెట్ అభిమానులకు నచ్చే సినిమా. యావరేజ్ నుంచి హిట్ స్దాయి లో ఉంటుంది. ఫ్యామిలీస్ కు పట్టిందంటే సూపర్ హిట్ అవుతుంది. అయితే రెగ్యులర్ గా నాని సినిమాల్లో కనపడే ఫన్ తక్కువగా భావోద్వేగాలకు ఎక్కువ పీట వేసారు. మజిలీ కు కాస్త దగ్గరలో ఈ సినిమా ఉంటుంది. 

అలాగే బయిట ప్రచారం జరుగుతున్నట్లు  ర‌మ‌ణ లాంబ అనే క్రికెట‌ర్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కించింది మాత్రం కాదు. ఈ సినిమా ఎవ‌రి బ‌యోపిక్ కాదు. పూర్తిగా అర్జున్ అనే ఫిక్ష‌న‌ల్ రోల్ చుట్టూ తిరిగే సినిమా .  ల‌వ్ స్టోరితో పాటు భార్య భ‌ర్త‌ల అనుబంధం, ఉద్వేగాల నేప‌థ్యం ఎక్కువ‌గా మైమ‌రిపిస్తుంది. జెర్సీ అంటే క్రీడాకారుడు ధ‌రించే డ్రెస్. ప్ర‌తి సినిమా  

Follow Us:
Download App:
  • android
  • ios