ఇష్క్‌, మనం లాంటి సూపర్‌ హిట్ చిత్రాలను అందించి వైవిధ్యైమైన కథా  చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు విక్రమ్‌ కె కుమార్‌. మరో ప్రక్క నేచురల్‌ స్టార్‌ నాని కూడా సేమ్ టు సేమ్ . దాంతో వీరిద్దరి కాంబినేషన్ లో   ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడన్న వార్తలు రావడంతో సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తుండటంతో ఆ ఎక్సపెక్టేషన్స్ రెట్టింపయ్యాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ కు పడుతుందనుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ప్రక్క దారి పట్టింది.   ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను గ్యాంగ్‌ లీడర్‌ అందుకోలేకపోయాడని టాక్ స్ప్రెడ్ అయ్యింది. దాంతో వరసపెట్టి  కమర్షియల్ సక్సెస్‌లు సాధించటంలో ఫెయిల్ అవుతున్న నాని తిరిగి ఫాంలోకి వస్తాడేమో అని ఎక్సపెక్ట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.  

హీరోగా సూపర్‌ హిట్ అందుకున్న కార్తికేయ విలన్‌గా మెప్పించినా పెద్దగా క్లిక్ కాలేదు.  రిలీజైన పది రోజులుకే రన్ క్లోజింగ్ కు వచ్చింది. కేవలం పదిహేను కోట్లు మాత్రమే ఈ పది రోజుల్లో కలెక్ట్ చేయగలిగింది. దాంతో  చాలా చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలనే మిగిల్చింది.  నాని గత చిత్రం జెర్శీ 21 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా కేవలం 15 కోట్లు దగ్గరే ఆగిపోయింది.  ఉన్నంతలో ఓవర్ సీస్ లోనే  ఈ సినిమా పరిస్దితి బాగుంది. యుఎస్ మార్కెట్లో  $927k కలెక్ట్ చేసింది . అయితే అక్కడా ఒక మిలియన్ డాలర్ కూడా కలెక్ట్ చేయలేకపోవటంతో లాస్ వెంచర్ గా నమోదైంది.  
 
ఏరియా.. షేర్

నైజాం         - 6.10
సీడెడ్          - 1.92
ఉత్తరాంథ్ర   - 2.06
గుంటూరు    -  1.21
ఈస్ట్ గోదావరి - 1.25
వెస్ట్ గోదావరి  - 0.93    
కృష్ణా              - 1.15
నెల్లూరు          - 0.50
మొత్తం ఆంధ్రా, తెలంగాణా కలెక్షన్స్ :  15+ కోట్లు