Asianet News TeluguAsianet News Telugu

‘గ్యాంగ్ లీడర్’కు అంతొస్తేనే సేఫ్..ఆ తర్వాతే లాభం!

గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘ఎమ్ సి ఎ’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు పెరుగుతుంది స్థిరపడుతుంది.  

Nani's Gang Leader target 30 cr
Author
Hyderabad, First Published Sep 12, 2019, 10:18 AM IST

ఈ శుక్రవారం గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు హీరో నాని, ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు.ఇందులో రివెంజ్‌ రైటర్‌ పార్థసారథి పాత్రలో నటించారు నాని. తన గ్యాంగ్‌తో కలిసి విలన్ పై ఎలా పగ తీర్చుకున్నాడు పార్ధసారథి. ఇందుకోసం ఎలాంటి స్కెచ్‌లు వేశాడు? విలన్ నుంచి ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్టు చుట్టూ తిరిగే ఈ సినిమాపై క్రేజ్ ఇప్పటికే క్రియేట్ అయ్యింది. కామెడీ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు విక్రమ్‌ కె కుమార్ దర్శకుడు.

 ఈ సినిమా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు నాని. ఈ చిత్రంతో తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. ఆయన గత చిత్రం ‘జెర్సీ’ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నప్పటికీ  కలెక్షన్స్ పరంగా చూస్తే వర్కవుట్ కాలేదు. కేవలం రూ.29 కోట్లకు దగ్గర్లో ఆగిపోయింది. దీంతో ఆయన కొంత నిరుత్సాహానికి గురయ్యారనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.28.20 కోట్లు జరిగిందని ట్రేడ్ టాక్. ఈ మొత్తం రికవర్ చేసి డిస్ట్రిబ్యూటర్లను లాభాల్లోకి తీసుకెళ్లాలంటే సినిమా సూపర్ హిట్ కావాలి. వసూళ్లు ‘ఎమ్ సి ఎ’ లెవల్లో ఉండాలి. అప్పుడే నాని మార్కెట్ రూ.35 నుండి 40 కోట్లకు పెరుగుతుంది స్థిరపడుతుంది.  గ్యాంగ్‌లీడర్‌తో  అది సాధించగలుగుతాడా? చిత్రం కొన్నవారికి గిట్టుబాటు కావాలంటే ఈ సినిమా గట్టిగా ఆడాల్సిందే. పాజిటివ్ టాక్ వస్తే అది పెద్ద కష్టమేమీ కాదు.

నాని హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్‌ కురువిల్లాలు నాని గ్యాంగ్‌ సభ్యులుగా నటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios