నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కూల్ గా కనిపిస్తాడు. తనకంటూ సపరేట్ క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ నానితో ఎలాంటి హడావిడి, ఆర్భాటాలు కనిపించవు. చాలా సింపుల్ గా ఉంటాడు. ఇప్పుడు ఇందంతా ఎదుకంటే నాని సింప్లిసిటీ మరోమారు బయట పడింది. నాని ఎయిర్ పోర్ట్ లో ఉన్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఎయిర్ పోర్ట్ లో వెళుతున్నప్పుడు ఎవరికైనా తనిఖీలు సహజమే. సెక్యూరిటీ సిబ్బంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోనికి అనుమతినిస్తారు. ఎయిర్ పోర్ట్ లో నాని వెళుతుండగా అక్కడి పోలీసులు చెకింగ్ నిర్వహించారు. నాని కూల్ గా పోలీసులకు సహకరిస్తున్న దృశ్యాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. 

నాని గాగుల్స్ ధరించి పోలిసుల వద్ద సాధారణ ప్రయాణికుడిలా నిలబడి ఉన్నాడు. ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'V' చిత్రంలో కూడా నాని నటిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.