నాని మళ్లీ జంతువులా మారిపోతున్నాడు

First Published 23, Dec 2017, 7:41 PM IST
nani role is golden fish in awe
Highlights
  • ఎంసీఏ బ్లాక్ బస్టర్ తో మాంచి జోష్ మీదున్న నాని
  • హలో కూడా సక్సెస్ కావటంతో అఖిల్ తో సెల్ఫీని ట్వీట్ చేసిన నాని
  • తాజాగా ఆ చిత్రంలో తన కేరక్టర్ పోస్టర్ రివీల్ చేసిన నాని

నేచురల్ స్టార్ నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాతో పలకరించి తెలుగు ప్రేక్షకులను అలలరించాడు. ఈ సినిమా కలెక్షన్స్ గురించి జోరుగా చర్చలు నడుస్తుండగా.. నాని తన కొత్త సినిమా లుక్ లో సోషల్ మీడియాలోకి దిగాడు. నాని సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’ నిర్మిస్తున్న ‘అ’ సినిమాలో అతడి పాత్రను ఈ రోజు పరిచయం చేశారు. నాని నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించబోతున్నాడు ఈ సినిమా. మనిషిగా ఉన్న నాని.. చేపగా మారిపోయాడు ఈ సినిమా కోసం."అ" చిత్రంలో నాని పోషిస్తున్నది చేప పాత్రే. ‘అ’ టైటిల్ లోగో లాంచ్ చేసినపుడే నాని ఇందులో ఓ పాత్రకు వాయిస్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత అతను వాయిస్ ఇచ్చేది ఒక చేపకు అని ప్రకటించారు. ఆ చేప ఫస్ట్ లుక్కే ఈ రోజు లాంచ్ చేశారు. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ నాని చేప చాలా అందంగా ఉంది. గోల్డెన్ ఫిష్ అనే గ్యారీబడ్డీ చేప ఎక్కడుంటే అక్కడ సిరి సంపదలే అంటారు. అంతా మంచే జరుగుతుందంటారు.

ఈ సినిమాలో రవితేజ ఒక చెట్టుకు వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి మాస్ రాజా చెట్టు లుక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం నుంచి ఇప్పటికే అవసరాల శ్రీనివాస్.. రెజీనా కసాండ్రా.. ఈషా రెబ్బాల లుక్స్ పరిచయమయ్యాయి. కాజల్ సహా మిగతా నటీనటుల లుక్స్ కూడా త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

loader