ఆ మధ్యన కాస్త వెనకబడ్డ  నేచుర‌ల్ స్టార్ నాని జెర్సీ చిత్రంతో మ‌ళ్ళీ త‌న ఫామ్  కొన‌సాగిస్తున్నాడు. ప్ర‌స్తుతం స్టార్ డైరక్టర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గ్యాంగ్ లీడ‌ర్ అనే సినిమా చేస్తున్నారు. అంతేకాక నాని ఈ సినిమాతో పాటు ప‌లు ప్రాజెక్టుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. అందులో భాగంగా  డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

వరుణ్ సందేశ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన కొత్త బంగారు లోకం వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించి అంద‌రి దృష్టిలో ప‌డ్డ శ్రీకాంత్ అడ్డాల ఆ త‌ర్వాత మ‌హేష్‌, వెంకీ కాంబినేష‌న్‌లో సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే చిత్రాన్ని చేశాడు. ఆ తర్వాత 2016లో మహేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం అనే చిత్రం చేశాడు. ఈ సినిమాకి  ఘోర పరాజయం పొందటంతో  ఓ మేకర్ గా ప‌రాభవం క‌లిగించింది . దీంతో ఈ సినిమా తర్వాత మరో ప్రాజెక్టును ఓకే చేయలేదు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.

అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు కొత్త సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్. తాను రెడీ చేసుకున్న కొత్త స్క్రిప్ట్‌ను శ్రీకాంత్ అడ్డాల ఇటీవలే నానికి వినిపించగా..దీనికి నాని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. నాని, శ్రీకాంత్ అడ్డాల శ్రీకాంత్ కాంబినేషన్ చిత్రం కేవలం మీడియా సృష్టే అని తేలింది. 
 
మరోవైపు నాని ప్రస్తుతం ‘గ్యాంగ్ లీడర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అటు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో కూడా నాని ‘V’ అనే చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.