Asianet News TeluguAsianet News Telugu

నేను లోకల్ మూవీ రివ్యూ

  • చిత్రం: నేను లోకల్
  • నటీనటులు: నాని, కీర్తి సురేష్, సచిన్ ఖేడ్కర్, పోసాని
  • సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ 
  • నిర్మాత: దిల్ రాజు
  • దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
  • ఏసియానెట్ రేటింగ్ : 3.5
nani nenu local review

కథ...

బాబు(నాని) సరదాగా కాలం వెళ్లదీసే కాలేజ్ స్టూడెంట్. తన స్నేహితులతో అల్లరిచిల్లరగా తిరిగే బాబు కెరీర్ గురించి పట్టించుకోకుండా నిత్యం ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకుంటాడు. డిగ్రీ పూర్తయ్యాక ఓ సారి కీర్తి(కీర్తి సురేష్)ని చూసి... తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు.  ఆమెని ఇంప్రెస్ చేయటానికి ఎంబీఏలో చేరుతాడు. కానీ... అతని అల్లరి చేష్టలు కీర్తికి, ఆమె కుటుంబ సభ్యులకు అస్సలు నచ్చవు. అయితే... చివరకు కీర్తి అతని ప్రేమలో పడిపోతుంది. కానీ.. ఆమె తండ్రి వాళ్ల ప్రేమను నిరాకరిస్తాడు. అప్పుడు బాబు ఆయనకి ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ ఏంటి.. కీర్తి తండ్రి తన ప్రేమను అంగీకరించేలా ఏం చేస్తాడు. అనే అంశాలే ప్రధానంగా సినిమా సాగుతుంది.

 

ఎలా ఉందంటే...

ఫస్టాఫ్ మొత్తం ఫ్రెష్ లవ్ స్టోరీ, ఎంటర్ టైన్ మెంట్ అంశాలతో సాగిపోతుంది.. ఎక్కడా బోరింగ్ అనిపించకుండా సరదాగా సాగిపోతుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ.. కీర్తిని ఇంప్రెస్ చేయడం కోసం నాని చేసే అల్లరి పనులు ఆకట్టుకుంటాయి. కీర్తి, నానిల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. కొన్ని ఎపిసోడ్ లు రొటీన్ గా అనిపించినా.. కొత్తగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. పాటలు కూడా సందర్భానుసారంగా వచ్చి ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ ఆసక్తికరమైన పాయింట్ తో ముగుస్తుంది. సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న టైమ్ లో నే సినిమాలోని ట్విస్ట్ బయటపడటంతో సినిమా కాస్త మందగిస్తుంది. అలా అరగంట సేపు బోరింగ్ గా సాగాక.. తిరిగి పుంజుకుంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అదుర్స్ అనిపించింది. ఈ ఎపిసోడ్ లోని ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటాయి. కీర్తి, నానిల అభినయం కట్టిపడేస్తుంది. కొన్ని రొటీన్ సీన్స్ ఉన్నా ఫస్టాఫ్ అంతా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అదిరింది. ఇక సెకండాఫ్ లో ట్విస్ట్ రివీల్ అయాక కాస్త గాడి తప్పినట్లు అనిపించినా క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ హైలెట్ గా నిలిచాయి. సెకండాఫ్ లో బోరింగ్ సీన్స్ పట్టించుకోకుంటే... సినిమాని చాలా ఎంజాయ్ చేయొచ్చు.

నటీనటులు...

నాని తన నేచురల్ నటనతో ఆకట్టుకున్నాడు. తన ఇమేజ్ పక్కనబెట్టి.. భిన్నమైన మాస్ రోల్ లో నటించి పాత్రకు పూర్తి న్యాయం చేశాడని చెప్పాలి. కీర్తి సురేష్ కూడా అందంతో, అభినయంతో కట్టిపడేసింది. ముఖ్యంగా నాని, కీర్తిల కెమిస్ట్రీ అదిరిందనిపించింది. హీరోయన్ తండ్రి పాత్రలో సచిన్ ఖేడ్కర్ కూడా న్యాయం చేశాడు. పోసానితోపాటు నటీనటులు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు...

మూవీలోని ప్రతి ఫ్రేము చాలా కలర్ ఫుల్ గా కనిపించడంలో సినిమాటోగ్రఫర్ పనితనం కనిపిస్తుంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం చాలా డీసెంట్ గా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. దిల్ రాజు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎప్పట్లానే గ్రాండ్ గా ఉన్నాయి. కథ కొత్తదేమీ కాకున్నా... అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చాలా ఆకర్షణీయంగా తెరకెక్కించారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకు అసెట్స్ గా నిలిచాయి. దర్శకుడు త్రినాథరావు నక్కిన తన ప్రతిభ మరోసారి చాటుకున్నాడు.

 

ప్లస్ పాయింట్స్...

హీరోహీరోయిన్లు నాని, కీర్తి సురేష్ ల నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ పై చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా కీర్తి సురేష్ అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ఇక కామెడీ, డైలాగ్స్, సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్...

కథ రొటీన్ దే అవటం మైనస్ పాయింట్. సెకండాఫ్ లో ట్విస్ట్ బయటపడ్డాక సినిమా మందగించడం కొంత నిరాశపరుస్తుంది. సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ కాస్త విసిగిస్తాయి.

చివరగా... సరదాగా సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “నేను లోకల్”

Follow Us:
Download App:
  • android
  • ios