నేచురల్ స్టార్ నానీ మళ్లీ రిస్క్ తీసుకోబోతున్నాడా...? ఆ ప్లాప్ ఫార్ములాతోనే మరో సారి ప్రయోగం చేయబోతున్నాడా..? ఇప్పటికే రెండు సార్లు దెబ్బతిన్నా.. నానీ అదే ఫార్ములా వెంట ఎందుకు పడుతున్నారు..? అసలేంటి ఆ ఫార్ములా..?
డిఫరెంట్ స్టైల్ టాలీవుడ్ హీరో నానిది. అంతే కాదు విభిన్న.. విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో కూడా నానీ మార్క్ వేరు. ఈ మధ్య ఇంకా ఎక్కువగా ప్రయోగాలు చేస్తున్నాడు. తాను మూస సినిమాలు చేస్తున్నాను అని వచ్చిన విమర్షలకు సమాధానం చెపుతూ.. వి, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుంటూ.. నటనలో కూడా కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక కథ నచ్చితే చాలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి కూడా నాని వెనుకాడడు. ఆ ఫార్ములా నానీనిఎందుకు అంతలా వెంటాడుతుంతో తెలియదు కాని.. ప్లాప్ లు వస్తున్నా.. మల్టీ స్టారర్ ను మాత్రం వదులుకోవడంలేదు నాని. గతంలో నాగార్జునతో కలిసి దేవదాసు, ఆది పినిశెట్టితో కలిసి నిన్నుకోరి,సుధీర్ బాబుతో కలిసి వి సినిమాలు చేశాడు.
అయితే అందులో నిన్న కోరి తప్పించి దేవదాసు, వి సినిమాలు దారణ పరాజయాన్నిమూటకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి మల్టీ స్టారర్ ప్రయోగానికి రెడీ అవుతున్నాడు నానీ. ఇప్పుడు మరో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆయన ఓకే చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. మల్టీ స్టారర్స్ అచ్చిరాకపోయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా తయారయ్యాడు యంగ్ హీరో.
ఇండియన్ ఫిల్మ్ బాక్సాఫీస్ ను శేక్ చేసిన కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ప్రస్తుతం ప్రభాస్ తో మరో పాన్ ఇండియ సినిమాగా సలార్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ హోంబలే ఫిలిమ్స్ తరువాత ప్రాజెక్టును వారు సుధ కొంగర దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో సూర్య - దుల్కర్ నటించనున్నారని సమాచారం.
ఈ సినిమాలో మరో హీరో పాత్ర కోసం నానిని సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే నానీకి సుధ కొంగర కథ చెప్పడం..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అన్ని జరిగిపోయాయని సమాచారం. త్వరలోనే ఈ భారీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కాని. లోపల ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయాట.
తమిళం నుంచి సూర్య, తెలుగు నుంచి నానీ, మలయాళం నుంచి దుల్కర్ సల్మాన్ నటిస్తుండటం, కన్నడ ప్రొడ్యూసర్లు నిర్మిస్తుండటంతో.. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉంటాయని భావిస్తున్నారు. మరి ఈ సినిమాలు నానీకి కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతందా..? లేదా..? అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకూ ఆగాల్సిందే.
