నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా చేయాలనుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇందులో మరో హీరో సుదీర్ బాబు కూడా కనిపించనున్నాడు.

ఈ మల్టీస్టారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు. అదేంటంటే.. 'వ్యూహం'. దాదాపు ఇదే పేరుని ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కానీ హీరోలు సెట్ కాకపోవడంతో ప్రాజెక్ట్ పెండింగ్ లో పడింది.

ఫైనల్ గా ఇద్దరు హీరోలు అంగీకరించడంతో సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇంద్రగంటి గతంలో నాని, సుదీర్ బాబు ఇద్దరిని హీరోలుగా పెట్టి సినిమాలు తీశాడు. ఇప్పుడు వారి ఒకే తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు.

కథ ప్రకారం సినిమాలో నాని పాత్ర సరికొత్తగా ఉంటుందట. అయితే నాని పోర్షన్ కంటే సుదీర్ బాబు పోర్షన్ ఎక్కువగా ఉంటుందని సమాచారం. మరి నానితో ప్లాన్ చేస్తున్న ఈ 'వ్యూహం' ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!