ఒకసారి సక్సెస్ అయిన కాంబినేషన్ లో సినిమా వస్తోందంటే డిస్ట్రిబ్యూటర్స్ ఉత్సాహం చూపెడతారు. అందుకే కెరీర్ లో గ్యాప్ వచ్చినప్పుడల్లా క్రేజ్ కోసం అలాంటి కాంబినేషన్  వెతుకుతూంటారు దర్శక,నిర్మాతలు, హీరోలు. ఇప్పుడు మారుతి పరిస్దితి అదే. శైలజారెడ్డి పెద్దగా ఆడకపోవటంతో ఆయనకు గ్యాప్ వచ్చింది. దాంతో ఆయన తన కెరీర్ లో పెద్ద హిట్ గా నిలిచిన  'భలే భలే మగాడివోయ్' హీరో నానితో మరో సారి సినిమా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. 

నానికు  కూడా 'భలే భలే మగాడివోయ్' చిత్రం  బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు న్యాచురల్ స్టార్ ని చేసేసింది.  అప్పటి నుంచి నాని ఫన్ ఎలిమెంట్ ని నమ్ముకుని దూసుకుని పోతున్నాడు. ఆ రేంజి సక్సెస్ ని ఇచ్చిన మారుతి దర్శకత్వంలో మరోసారి నాని నటించలేదు, దాంతో మారుతితో సినిమా అనగానే ఓకే అనేసినట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం ఈమధ్యే మారుతి , నాని ఇద్దరూ కలిసి స్టోరీ విషయంపై చర్చించారట. నాని ఇంట్రస్ట్ చూపడంతో మారుతి ఇప్పటికే స్క్రిప్ట్  రెడీ చేయడం మొదలు పెట్టాడట. అయితే ఈ ప్రాజెక్టుని ఇలా సెట్ అవుతుందనగానే..  'భలే భలే మగాడివోయ్'   సీక్వెల్ తీస్తాడంటూ ప్రచారం మొదలైంది. అంటే మళ్లీ మతిమరుపు కథ అంటున్నారు. అయితే నాని దానికి ఒప్పుకోడని చెప్తన్నారు. ఫ్ఱెష్ ధాట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతోందని అంటున్నారు. 

నాని డేట్స్ గీతా ఆర్ట్స్ లోఉన్నాయి. మారుతి ఓ చిత్రాన్ని యువి క్రియేషన్స్ చేస్తానని మాట ఇచ్చాడట. దాంతో వీళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ద్వితీయార్దంలో ఈ సినిమా పట్టాలు ఎక్కబోతోందని వినికిడి.