న్యాచురల్ స్టార్ నాని ఈ సారి క్రికెటర్ గా అలరించేందుకు సిద్దమవుతున్నాడు. గౌతమ్ దర్శకత్వంలో జెర్సీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. టీజర్ తోనే నాని సినిమాపై యూత్ లో ఆసక్తిని రేపుతున్నాడని చెప్పవచ్చు.  ముఖ్యంగా డైలాగ్స్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. 

‘నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్.. ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్’ అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయ్యే ఈ టీజర్ తో తెలియని ఎమోషన్ ని కలిగించారు.మెయిన్ గా  ‘యు ఆర్ ది లూజర్ ఆఫ్ యువర్ లైఫ్’ అనే డైలాగ్ తో పాటు 'ఆపేసి ఓడిపోయినవాడున్నాడు కానీ.. ప్రయత్నించి ఓడిపోయిన వాడు లేడు’ అనే డైలాగ్ కూడా బావుంది. 

మళ్ళీ రావా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ ఈ సినిమాతో తన అసలు టాలెంట్ ను బయటపెట్టడానికి రెడీ అయినట్లు టీజర్ తో చెప్పేశాడు. ఇక సినిమా కోసం నాని స్పెషల్ గా క్రికెట్ కోచింగ్ కి కూడా వెళ్ళాడట. మంచి కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.