న్యాచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా పాజిటివ్ టాక్ తో నానికి మంచి గుర్తింపు తెచ్చింది. వరుస అపజయాలతో ఉన్న నానికి జెర్సీ పెద్ద రిలీఫ్ అని చెప్పవచ్చు. ఓపెనింగ్స్ లో కొద్దిగా తడబడినప్పటికీ తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాడు. 

సినిమా టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే 24 కోట్లు. అయితే ఇంతవరకు సినిమాకు వచ్చిన షేర్స్ 35 కోట్లను సమాచారం. ఈ లెక్కలు పాజిటివ్ గానే ఉన్నప్పటికీ సినిమాకి వచ్చిన హిట్ టాక్ ను బట్టి కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని అంతా భావించారు. ఏదేమైనా నాని సమ్మర్ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో డీసెంట్ బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకున్నాడు. 

ఓ విధంగా మజిలీ సినిమా గట్టిపోటీని ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే మహర్షి రాకతో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద జెర్సీ సందడి తగ్గింది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమాకు అనిరుద్ అందించిన సంగీతం బాగా ప్లస్ అయ్యింది. ప్రస్తుతం నాని విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్ లిడర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.