ఈ మధ్యకాలంలో తెలుగులోకి డబ్ అవుతోన్న హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో ప్రధాన పాత్రలకు డబ్బింగ్ చెప్పడానికి మన టాలీవుడ్ హీరోలు ముందుకు వస్తున్నారు. 'అవెంజర్స్' లాంటి క్రేజ్ ఉన్న సినిమాకి రానా డబ్బింగ్ చెబితే.. ఇటీవల విడుదలైన 'అల్లాదిన్' సినిమాలో రెండు ప్రధాన పాత్రలకు వెంకీ, వరుణ్ లు తమ వాయిస్ అందించారు. 

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి యంగ్ హీరో నాని కూడా జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే విడుదల కానున్న 'ది లయన్ కింగ్' సినిమాలోని సింబా పాత్రకు నేచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెబుతున్నాడు.

డిస్నీ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరో పాత్రకు నాని డబ్బింగ్ చెబుతుండడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక ఇదే సినిమాలో ముసాఫా అనే పాత్రకు జగపతి బాబుడబ్బింగ్ చెబుతున్నారు.

అలానే మరికొన్ని కీలకపాత్రలకు బ్రహ్మానందం, అలీ, రవిశంకర్ లు డబ్బింగ్ చెబుతున్నారు. 'సింబా' పాత్రకు బాలీవుడ్ లో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెబుతుండగా.. ముసాఫా పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నారు.