నాని గ్యాంగ్ లీడర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. నాని సరసన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటి శరణ్య, లక్ష్మి కీలక పాత్రల్లో నటించారు. విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని సరదాగా సాగిపోయే రివేంజ్ కథగా తెరకెక్కించారు. 

ఈ చిత్రానికి మంచి టాక్ రావడంతో సోషల్ మీడియాలో నాని చేస్తున్న ట్వీట్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్యాంగ్ లీడర్ చిత్రం విడుదల రోజు నాని ఆసక్తికర ట్వీట్స్ చేశాడు. సినిమా సూపర్ హిట్ అయితేనే నిద్ర లేపండి లేకుంటే వద్దు అని ట్వీట్ చేశాడు. 

సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత సంగీత దర్శకుడు అనిరుధ్ ట్వీట్ చేస్తూ.. నీ నిద్రకు భంగం కలిగించే టైం వచ్చింది. మరో సూపర్ హిట్.. లేవండి బ్రదర్ అని ట్వీట్ చేశాడు. 

దీనికి కొనసాగింపుగా నాని చేసిన ఫన్నీ ట్వీట్ ఆకట్టుకుంటోంది.సీనియర్ నటి లక్ష్మి పక్కనే ఉన్న నాని నిద్రలేచి.. ఇంత వైలెంట్ గా లేపేశారు ఏంటి బామ్మా అని అడిగాడు. దీనికి బామ్మ సమాధానం ఇచ్చినట్లుగా.. ఒకసారి నీకు వచ్చిన ట్వీట్స్ చూసుకో అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.