న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాకు సంబందించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. షూటింగ్ లో నానికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఆటకు సంబందించిన సన్నివేశాల్లో పాల్గొన్న నాని అనుకోకుండా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. మళ్ళిరావా సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా గౌతమ్ ఈ డిఫరెంట్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాని స్పెషల్ గా క్రికెట్ కోచింగ్ కూడా తీసుకున్నాడు. అయితే కొన్ని సీన్స్ కోసం రిస్కీ షాట్ ఆడబోయి షూటింగ్ స్పాట్ లో బంతి నాని ముఖంపై తగిలినట్లు తెలుస్తోంది. చిన్నపాటి గాయాలు కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని చిత్ర యూనిట్ నుంచి సమాచారం అందింది. 

అయితే గాయం కారణంగా నాని రెండు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ షూటింగ్ కు వస్తాడని చెబుతున్నారు. ఇటీవల రిలీజైన సినిమా టీజర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.  

asianet news special

షార్ట్ ఫిలిమ్స్ చేసి కష్టపడి పైకొచ్చిన తెలుగు యువ దర్శకులు!