Asianet News TeluguAsianet News Telugu

నాని ఫ్లాప్ సినిమా మూడు భాషల్లో రీమేక్‌?

ఈ సినిమా తీస్తున్నపుడు తాను చాలా నవ్వుకుంటూ పని చేశానని.. హీరో తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్ మీదికి వెళ్లడం యునీక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు.

Nani Gang Leader remade in 3 languages? jsp
Author
Hyderabad, First Published Jun 13, 2021, 9:30 AM IST

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా క్లాసిక్స్ గా నిలుస్తూంటాయి. అంతేకాదు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతూంటాయి.  నేచురల్ స్టార్ నాని చేసిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా కూడా ఇప్పుడు మూడు భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఆ సినిమా తెలుగులో ఫ్లాఫ్ అయ్యింది. అయినా రీమేక్ అవుతూ ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయమై దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడారు. ‘గ్యాంగ్ లీడర్’ హిందీతో పాటు తమిళం, మలయాళంలో రీమేక్ అవుతోందని.. ఓ దర్శకుడికి ఇంతకంటే సంతృప్తి ఏముంటుందని విక్రమ్ అన్నాడు. 

విక్రమ్ కుమార్ మాట్లాడుతూ....తన భార్య శ్రీనిధి తన సినిమాలకు పెద్ద క్రిటిక్ అని.. తాను ఓ సినిమా చేయడానికి ముందు ఆమెకు కథ చెప్పి అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్తానని.. ‘గ్యాంగ్ లీడర్’ స్క్రిప్టు విషయంలో ఆమె పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిందని విక్రమ్ చెప్పాడు. ఇక హీరో నానీకి కూడా ఈ సినిమా చాలా ఇష్టమని చెప్పాడు. ఈ సినిమా తీస్తున్నపుడు తాను చాలా నవ్వుకుంటూ పని చేశానని.. హీరో తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్ మీదికి వెళ్లడం యునీక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు.

ఇక నాని నటించిన జెర్సీ ఓ క్లాసిక్. నటుడిగా నాని కెరీర్ లో అద్భుతమైన మైలు రాయి. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ ఫ్లాఫ్ అయ్యింది. రొటీన్‌కి భిన్నంగా ఆలోచిస్తూ మనం, 24, ఇష్క్‌ లాంటి చిత్రాలు అందించిన విక్రమ్‌ కుమార్‌ నుండి వచ్చిన సినిమా ఇది. అయితే ఈ గ్యాంగ్ లీడర్ మాత్రం నిరాశ పరిచాడు. విక్రమ్ కుమార్ మెరుపులు ఇందులో కరువయ్యాయని రివ్యూలు వచ్చాయి. నాని మొత్తం సినిమాని భుజాలపై వేసుకున్నా సరే.. స్క్రీన్ ప్లే లో వైవిధ్యం లేకపోవడంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు గ్యాంగ్ లీడర్.  
 

Follow Us:
Download App:
  • android
  • ios