నాని కెరీర్ లో అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది భలే భలే మగాడివోయ్ మూవీ. దర్శకుడు మారుతీ ఈ చిత్రాన్ని కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మతిమరుపు ప్రేమికుడి పాత్రలో నాని నటన అద్భుతం అని చెప్పాలి. ఆయన చేసిన కామెడీ తెరపై వీర లెవెల్లో పండింది. కాగా ఆ చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 

ఈ సంధర్భంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి చిత్ర యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా లావణ్య తన ఆనందం తెలియజేయగా, దానికి హీరో నాని ఫన్నీ రిప్లై ఇచ్చాడు. థాంక్యూ నందన, రేపు సినిమాకు వెళదాం ప్రసాద్స్ లో, సారీ మర్చిపోయా థియేటర్స్ లేవు కదా అని చమత్కరించాడు. 

ఇక నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వి రేపు విడుదల అవుతుంది, అమెజాన్ ప్రైమ్ లో రేపటి నుండి వి మూవీ స్త్రీమ్ కానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. ఇక మరో హీరో సుధీర్ పోలీస్ పాత్ర చేస్తున్నారు. నివేదా థామస్, అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.