మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఇప్పటికీ ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు వార్తలు వచ్చాయి.
నాని హీరోగా రూపొందుతున్న దసరా సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ ప్రారంభించిన నాటి నుంచి ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో చిత్రం బిజినెస్ అన్ని ఏరియాల్లో క్లోస్ చేసారు.
అందుతున్న సమాచారం మేరకు చిత్రం సీడెడ్ రైట్స్ ని 6.5 కోట్లకు, మిగిలిన ఆంధ్రా రైట్స్ 13 – 14 కోట్ల మధ్య జరిగింది. ఓవరాల్ గా ఆంధ్రా థియేటర్ రైట్స్ 20 కోట్లకు క్లోజ్ చేసినట్లు సమాచారం. తెలంగాణాలో దిల్ రాజు స్వయంగా తన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణా ఏరియాలో నానికు స్ట్రాంగ్ బిజినెస్ ఉండటంతో 14 కోట్లు ఇక్కడ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం తెలుగు రెండు రాష్ట్రాల బిజినెస్ 34 కోట్లకు ముగిసిందని, వరల్డ్ వైడ్ గా 43 కోట్లకు రీచ్ అయ్యిందని సమాచారం.
ఇక ఇప్పటికే డిజిటల్ రైట్స్ 48 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. శాటిలైట్‌తో పాటు ఓవర్‌సీస్ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్‌కు భారీగానే దసరా సినిమా లాభాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు తెలిసింది. రిలీజ్‌కు ముందే నిర్మాతకు దాదాపు 12 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమాను బాలీవుడ్లో అనిల్ తడానీ వంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు తీసుకొన్నారట. కర్ణాటక నుంచి KRG కేరళ నుంచి E4E ఓవర్ సీస్ Phars ఇలా అన్ని చోట్ల పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి దిగారని తెలిసింది.
నిర్మాత సుధాకర్ చెరుకూరి.. దసరా సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను హోల్ సేల్ గా రూ. 24 కోట్ల భారీ రేటుకు చదలవాడ శ్రీనివాసరావుకు అమ్మేశారు. ఈ లోగా దసరా టీజర్పాటలు రిలీజై దుమ్ము రేపాయి. దీంతో వెంటనే దిల్ రాజు రంగంలోకి దూకారు. ఊహించని ఆఫర్ ఇచ్చి చదలవాడ శ్రీనివాసరావు దగ్గర తెలుగు రాష్ట్రాల హక్కులు కొనేశారని తెలిసింది. చదలవాడ కొన్నదానికి కన్నా నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చి మరి.. తీసుకున్నారట. దీంతో సినిమా రిలీజ్ కు ముందే చదలవాడ ఫుల్ గా లాభపడ్డారు. నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎమ్‌సీఏ తర్వాత కీర్తిసురేష్ నాని జంటగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
