`జెర్సీ`, `శ్యామ్ సింగరాయ్` ఫెయిల్యూర్, `దసరా` అక్కడ ఆడలేదు.. నాని రియాక్షన్ మాత్రం క్రేజీ
`జెర్సీ`, `శ్యామ్ సింగరాయ్` సినిమాలకు సంబంధించిన బయ్యర్లకి నిర్మాతలు డబ్బులు వెనక్కి ఇచ్చారనేది ప్రశ్న. మరి హీరో నాని రియాక్షన్ ఏంటో తెలుసా?

నాని చివరగా `దసరా` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. అంతకు ముందు చేసిన `అంటే సుందరానికి` నిరాశ పరిచింది. `శ్యామ్ సింగరాయ్` యావరేజ్‌గా ఆడింది. మరోవైపు `జెర్సీ` చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కమర్షియల్‌గా నష్టాలను తెచ్చిందనే టాక్ వినిపించింది. అయితే తాజాగా అదే ప్రశ్న నానికి ఎదురైంది. మంచి సినిమాలు చేస్తున్నారని,కొత్త రకమైన సినిమాలు అందిస్తున్నారు, కానీ మీ చిత్రాలు కమర్షియల్‌గా ఆడటం లేదని, బయ్యర్లకి నష్టాలను మిగుల్చుతున్నాయని, దీంతో కొంత పేమెంట్లు నిర్మాతలు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందనే ప్రశ్నకి నాని కి ఎదురైంది.
తాజాగా దీనిపై నాని స్పందించారు. తన సినిమాలేవీ నష్టాలను తేవడం లేదన్నారు. `జెర్సీ` విషయంలో కొంత అమౌంట్ బయ్యర్లకి వెనక్కి ఇచ్చారనే వార్తలో నిజం లేదని, అది డబుల్ ప్రాఫిట్ అన్నారు. సినిమాకి పది రూపాయలు పెడితే యాభై రూపాయలు వచ్చిందని వెల్లడించారు. థియేట్రికల్‌గా వందలో 30శాతమే అని, కానీ ఓటీటీ, శాటిలైట్, రీమేక్ రైట్స్ ఇలా అన్ని రూపాల్లో మరో 70శాతం వచ్చిందని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ లెక్కలు కూడా తన వద్ద ఉన్నాయని తెలిపారు.
`శ్యామ్ సింగరాయ్` సినిమా విషయంలోనూ అంతే అని, నిర్మాతలకు నష్టాలు రాలేదన్నారు. ఇప్పుడు సినిమా కేవలం థియేట్రికల్ మాత్రమే కాదు, ఇతర ప్లాట్‌ఫామ్ ల ద్వారా వస్తున్నాయని తెలిపారు. అయితే `అంటే సుందరానికి` విషయంలో మాత్రం నష్టాలు అనేదాన్ని ఒప్పుకుంటానని చెప్పారు. మిగిలిన చిత్రాల విషయంలో నిర్మాతలు హ్యాపీనే అనే విషయాన్ని నాని చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక `దసరా` సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఆడలేదని, నార్త్ లో బాగా ప్రమోట్ చేసినా కలెక్షన్లు రాలేదనే ప్రశ్నకి స్పందిస్తూ, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అన్నారు. నార్త్ లో తనకు మార్కెట్ లేదని, ఒక్కో సినిమాకి పెంచుతూ వెళ్తున్నానని, తనకున్న మార్కెట్‌కి, ఆ చిత్రానికి నార్త్ లో వచ్చిన కలెక్షన్ల పరంగా అది పెద్ద హిట్టే అన్నారు. ఇలాంటి రూమర్లని మీడియానే ఆపాలని క్రేజీగా స్పందించారు నాని.
కొత్తగా సినిమాలు చేయడం, `దసరా` తర్వాత మాస్ మూవీ కాకుండా `హాయ్ నాన్న` చిత్రం చేయడంపై స్పందిస్తూ, తాను ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రిస్క్ తీసుకుని ఇక్కడి వరకు వచ్చానని, మళ్లీ సేఫ్ గేమ్ ఆడటం ఎందుకన్నారు. ఇలాంటి డిఫరెంట్ జోనర్ చిత్రాలే చేస్తానన్నారు. శౌర్యువ్ దర్శకత్వం వహించిన `హాయ్ నాన్న` చిత్ర టీజర్ తాజాగా విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఈ చిత్రం డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.