Asianet News TeluguAsianet News Telugu

నాని కమెంట్స్ లేనిపోని హైప్ క్రియేట్ చేసే హీరోలపైనేనని టాక్

  • నిన్నుకోరి సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆసక్తికర కమెంట్స్ చేసిన నాని
  • నాని కమెంట్స్ పై ఇండస్ట్రీ వర్గాల్లో సర్వత్రా చర్చ
  • కలెక్షన్స్ లాభాలు రాకున్నా హైప్ క్రియేట్ చేయనని నాని కమెంట్స్
nani comments on creating hipe going viral and doing buzz

నిన్నుకోరి సినిమాను ప్రమోషన్ సందర్భంగా హీరో నాని చేసిన కమెంట్స్... తెలుగు పరిశ్రమలో తాజాగా చర్చనీయాంశంగా మారాయి. హీరోలు ఫేక్ లెక్కలు చెప్పి అందని అందలాలు ఎక్కి ఇమేజ్ కోసం పాకులాడుతున్నారన్న మాట చెప్పకనే చెప్పాడు నాని. నాని తాజాగా చేసిన ఈ కమెంట్స్ ఇటీవల నెగటివ్ రివ్యూలు తెచ్చుకున్న ఓ మూవీ హీరోను టార్గెట్ చేసినట్లున్నాయని ఫిలిం సర్కిల్ లో గుసగుసలాడుతున్నారు.

 

ఇటీవలే రిలీజ్ అయిన ఓ యంగ్ హీరో మూవీ నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ పరంగా వంద కోట్లు దాటిందంంటూ అధికారికంగా ప్రచారం చేసేశారు. ఆ చిత్ర హీరోని టార్గెట్ చేసేవిగా నాని కమెంట్స్ వున్నాయన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. నాని మాట్లాుతూ.. తన పెరుగుదల కోసం తన సినిమాల బడ్జెట్ పెంచను అని అంటూ తన సినిమా గొప్ప అని అనిపించుకోవడానికి లేనిపోని లెక్కలు చెప్పను అంటూ నాని చేసిన వ్యాఖ్యలు దిల్ రాజు నిర్మించిన ఓ హీరో లేటెస్ట్ మూవీ ని దృష్టిలో పెట్టుకుని చేసినవే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.  

 

భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసిన తరువాత సినిమా ఆడినా... లాభాలు రాకపోతే ఫ్లాప్ అంటారు.. అది తనకు నచ్చదు అంటూ నాని చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ‘దువ్వాడ’ ను టార్గెట్ చేసేవిగామ  ఉన్నాయి అనిఅంటున్నారు. ఒక బిజినెస్ ను 10-20 శాతం పెంచుకోవడంలో తప్పులేదు. కానీ లేనిపోని జిమ్మిక్కులు చేసి 50 శాతం, 100శాతం పెంచడం అది హీరోకి గాని ఆ సినిమా బయ్యర్లకు మంచిదికాదు అంటూ నాని చేసిన కామెంట్స్ ‘దువ్వాడ’ ను ద్రష్టిలో పెట్టుకుని చేసినవి అని అంటున్నారు.

 

వాస్తవానికి నాని తన మాటల్లో ఎక్కడా బన్నీ ప్రస్తావన తీసుకురాకపోయినా అదే విధంగా ‘డిజే’ గురించి ఒక్క మాట కూడ మాట్లాడక పోయినా నాని మాట్లడిన ప్రతీమాటలో బన్ని గుర్తుకు వచ్చాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.    ఇదే సందర్భంలో మరో ఆశక్తికర కామెంట్ చేసాడు నాని. ‘సినిమా, సినిమాకు మనం ఎదగాలి ఒక్కో మెట్టు ఎక్కాలి. ఒకేసారి అన్నీ ఎక్కేస్తాం అంటే కింద పడిపోతాం’ అన్నాడు దీనితో నాని మాటలు ఎవరిని టార్గెట్ చేసేవిగా ఉన్నాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.  

 

వరుసగా హిట్స్ వస్తున్నాయని, మార్కెట్ పెరుగుతోందని తను గర్వంగా ఫీల్ అవ్వడం లేదని అంటూ ఎప్పటికైనా, ఏదో ఒక పాయింట్ వద్ద ఫ్లాప్ వస్తుందనే విషయం తనకు తెలుసు అని చెప్పడం వెనుక రేపు విడుదల అవుతున్న ‘నిన్ను కోరి’ సినిమా పై నానీకి కూడ నమ్మకం లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నాని చెపుతున్న విషయాలు టాప్ హీరోలకు తెలియని విషయాలు కాకాపోయినా నాని ఈ కామెంట్స్ అన్ని ఎవరిని మనసులో పెట్టుకుని అన్నాడు అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..

Follow Us:
Download App:
  • android
  • ios