సూపర్ హిట్ అంట.. సినిమా ఆడలేదు బాబాయ్: నాని

First Published 25, May 2018, 7:21 PM IST
nani comment on krishnaarjuna yuddham movie result
Highlights

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సినిమా 'కృష్ణార్జున యుద్ధం' ప్రేక్షకుల ముందుకు వచ్చిన 

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన సినిమా 'కృష్ణార్జున యుద్ధం' ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేసిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ చేసినా వర్కవుట్ కాలేదు. సినిమా కనీసపు వసూళ్ళకు కూడా సాధించలేదు.

సాధారణంగా ఏ హీరో కూడా తన సినిమా ఫ్లాప్ అని బహిరంగంగా చెప్పడానికి ఇష్టపడరు. సందర్భం వచ్చినా.. వర్కవుట్ అవ్వలేదు అన్నట్లు మాట్లాడతారు కానీ అంతకుమించి కామెంట్స్ చేయరు. కానీ నాని మాత్రం తన సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని సోషల్ మీడియాలో అంగీకరించాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్ వారు నాని సూపర్ హిట్ సినిమా 'కృష్ణార్జున యుద్ధం' సినిమా చూడండి అంటూ లింక్ వేశారు. దానిపై స్పందించిన నాని.. ''సూపర్ హిట్ అంట.. అవ్వలేదు బాబాయ్.. ఆడలేదు కూడా.. అయిన మనసు పెట్టి చేశాం. చూసేయండి'' అంటూ కామెంట్ చేశాడు.  

 

loader