జెర్సీ సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ ఒడ్డున పడ్డ నాని నెక్స్ట్ సినిమాలపై ద్రుష్టి పెట్టాడు. జెర్సీ పాజిటివ్ టాక్ ను అందుకున్నప్పటికీ కమర్షియల్ గా చిత్రం పెద్దగా లాభాలను అందించలేకపోయింది. అందుకే వీలైనంత వరకు రెగ్యులర్ కథలను కాకుండా కొత్త తరహా స్క్రిప్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. 

ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ సినిమాతో పాటు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు V అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. సుధీర్ బాబు మరొక కథానాయకుడిగా నటిస్తున్నాడు. అయితే సినిమాలో నాని పాత్ర నెగిటివ్ షెడ్ లో కనిపిస్తుందట. అలాగని పూర్తిగా అది నెగిటివ్ క్యారెక్టర్ కాదని తెలుస్తోంది. 

స్క్రీన్ ప్లే ఎమోషనల్ గా సాగుతుందట. ఓ విధంగా చెప్పాలంటే మహాభారతంలో కర్ణుడి తరహా పోలికలు కలిగి ఉంటుందని టాక్. స్నేహితుడి కోసం ఊహించని తప్పులు చేసి ఆ తరువాత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది. మరి ఈ పాత్రతో నాని ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నివేత థామస్ అదితి రావ్ హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.