Asianet News TeluguAsianet News Telugu

స్పైడర్ ను దూరం పంపిన బన్నీ, నాని. మహేశ్ ఫ్యాన్స్ అసహనం

  • మహేష్ బాబు అభిమానులకు మళ్లీ బ్యాడ్ న్యూస్
  • జూన్ 23నన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బన్నీ, నాని
  • ఇదే రోజు బన్నీ డీజే దువ్వాడ జగన్నాథం, నాని నిన్ను కోరి విడుదల
  • మహేస్-మురుగదాస్ సినిమా స్పైడర్ రిలీజ్ లేనట్టేనని తేల్చిన బన్నీ,నాని

 

nani bunny confirms mahesh murugadoss movie release date post ponement

మహేశ్ష్బాబు కొత్త సినిమా 'స్సైడర్' వాయిదా అంటూ జరుగుతున్న ప్రచారం కరెక్ట్ అని వంద శాతం ఫిక్స్ అయిపోవచ్చా. అంటే అవుననే చెప్తున్నాయి తాజా పరిణామాలు. జూన్ 23న మహేశ్-మురుగదాస్ సినిమా ఖచ్చితంగా రానట్లే అని తేలిపోయింది. ఎందుకంటే అదే రోజు బన్నీ,దిల్ రాజుల డీజే దువ్వాడ జగన్నాథం సినిమాతోపాటు నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న 'నిన్ను కోరి' చిత్రం రిలీజ్ ఫిక్సయింది.

 

నిన్ను కోరి చిత్రాన్ని జూన్ 23 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాత డీవీవీ దానయ్య అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా ఇచ్చేశాడు. 'స్పైడర్' తర్వాత మహేష్.. కొరటాల శివతో చేయాల్సిన సినిమాను నిర్మించబోయేది దానయ్యే. కాబట్టి మహేష్ నుంచి పక్కా సమాచారం అందుకున్నాకే 'నిన్ను కోరి' రిలీజ్ డేట్ ను దానయ్య ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

 

మరోవైపు మే 19 నుంచి జూన్ 23కు మారిన 'దువ్వాడ జగన్నాథం' రిలీజ్ డేట్ అదేనని దిల్ రాజు అఫీషియల్ గా కన్ఫమ్ చేశాడు. నాని సినిమాను ఆ తేదీకి షెడ్యూల్ చేయటంతో... మహేష్ బాబు సినిమమా లేనట్టేనని దిల్ రాజు కూడా ఫిక్సయిపోవటం వల్లనే బన్నీ సినిమా సరిగ్గా అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నాని సినిమాతో  డీజేకు పెద్దగా ఎఫెక్ట్ ఉండదనే ధోరణిలో దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి మహేష్ సినిమా జూన్ 23న రావట్లేదనేది తాజాగా నిర్ణయించిన డీజే రిలీజ్ డేట్ చూస్తేనే అర్థమవుతోంది. మరి మహేశ్ ఫ్యాన్స్ కు ఇంకెప్పుడు గుడ్ న్యూస్ వస్తుందో ఏమో. 

Follow Us:
Download App:
  • android
  • ios