బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగు జనాలకు కూడా బాగా ఎక్కేసిందని సెకండ్ సీజన్ తో క్లియర్ గా అర్థమైంది. హౌస్ లో ఎక్కువగా గొడవలు అవ్వడం బయట కాంట్రవర్సీలకు తావివ్వడం.. ఈ సారి ప్రతి విషయంలో డోస్ గట్టిగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే బిగ్ బాస్ 2 వల్ల ఎవరికీ ఏ స్థాయిలో స్టార్ డమ్ దక్కిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. 

అయితే ఎవరికీ ఎంత దక్కినా బిగ్ బాస్ కారణంగా నాని మాత్రం చాలా నెగిటివ్ టాక్ అందుకున్నాడని చెప్పవచ్చు. మొదటి నుంచి సోషల్ మీడియాలో హోస్ట్ గా చేసిన నానికి ఇబ్బందులే ఎదురయ్యాయి. ఎన్టీఆర్ రాకపోవడం కొంత ఎఫెక్ట్ అయితే శ్రీ రెడ్డి వివాదం మరింత దెబ్బ. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తించిన తీరుకు నాని తీసుకున్న నిర్ణయాలు చెప్పిన విధానం రివర్స్ అయ్యాయి. ముఖ్యంగా కౌషల్ విషయంలో అయితే నానికి ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది.

ఒంటరిగా తన ప్రవర్తనతో కౌశల్ ఆర్మీని సంపాదించుకున్న కౌశల్ విషయంలో కూడా నానిపై ఏ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయో తెలిసిందే. అయితే నాని మాత్రం ఈ ఇయర్ లో ఇబ్బంది పడినట్టుగా ఏ ఇయర్ లో పడలేదని చెప్పాలి. దీంతో కొంత మంది నెటిజన్స్ ఏవండోయ్ నాని గారు బిగ్ బాస్ ఏమిచ్చింది అని కౌంటర్లు వేస్తున్నారు. బుల్లితెరపైకి వస్తే ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా దగ్గరవచ్చు. మరి నాని ఎంతవరకువారి ఆదరణను అందుకున్నాడో ఆయనకే తెలియాలి. మరి తరువాత సీజన్ పై నాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.