లీగల్ సమస్యల్లో ...నాని " అంటే.. సుందరానికి" ?


నానీ తాజాగా నటిస్తున్న సినిమా " అంటే.. సుందరానికి" , పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రెడీ కాబోతున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.  వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా విడుద‌ల చేసిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల్ని పెంచేసింది. అయితే ఈ లోగా ఊహించని విధంగా ఈ మూవీ పై వివాదం మొద‌లైనట్లు సమాచారం. 
 

Nani ante sundaraniki in legal trouble!? jsp

వివరాల్లోకి వెళితే...ఈ చిత్ర ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ `పెళ్లి చూపులు` ఫేమ్ రాజ్ కందుకూరి నిర్మించిన `మెంట‌ల్ మ‌దిలో` చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆ సినిమా చేసేటప్పుడు ఓ ఎగ్రిమెంట్ చేసుకున్నారట. `మెంట‌ల్ మ‌దిలో`  మూవీ త‌రువాత `బ్రోచే వారెవ‌రురా` చిత్రాన్ని చేసిన వివేక్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని రాజ్ కందుకూరు  సొంత బ్యాన‌ర్ ధ‌ర్మ‌ప‌త క్రియేష‌న్స్ లో చేస్తాన‌ని అగ్రిమెంట్ చేసుకున్నార‌ట‌.

 అయితే ఇప్పుడు దాన్ని ప‌క్క‌న పెట్టి త‌న మూడ‌వ చిత్రాన్ని మైత్రీ వారితో చేస్తుండ‌టం ఇప్ప‌డు స‌మ‌స్య‌గా మారిందని తెలుస్తోంది. ఈ విషయమై  ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో నిర్మాత రాజ్ కందుకూరి ఫిర్యాదు చేయ‌డంతో వివాదం వెలుగులోకి వ‌చ్చింది.  నాని సినిమా సెట్స్ పైకి వెళ్లేకంటే ముందే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని నిర్మాత రాజ్‌కందుకూరి ప‌ట్టుడుతున్నట్లు సమాచారం. ఈ వివాదంపై పరిష్కారం కోసం చర్చలు ఇండస్ట్రీ పెద్దలు సమక్షంలో జరుగుతున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. 
 
 నాని హీరోగా నటిస్తున్న 28వ చిత్రమిది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో మలయాళ హీరోయిన్ నజ్రియా ఫహాద్‌ నటిస్తోంది. ‘ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ నేపథ్యంలో అందరిని అలరిస్తుంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించే  సినిమా ఇది’ అని చిత్ర టీమ్ తెలిపింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: లతా అరుణ్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ వై, రచన-దర్శకత్వం: వివేక్‌ ఆత్రేయ.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios