నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రాల అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తారో తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు మంచి క్రేజ్ ఉంది.  అయితే గత కొంతకాలంగా ఆయన తాజా చిత్రం గ్యాంగ్ లీడర్‌ అప్ డేట్స్ లేవు.  ఇది గమనించిన నాని ..ఫ్యాన్స్ కు అభయహస్తం ఇచ్చారు. 

వరసపెట్టి అప్ డేట్స్ ఇచ్చి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని. అన్నమాట ప్రకారం ఈ రోజు ఎప్పుడు ఏయే ప్రమోషన్ యాక్టివిటీస్ చేయబోతున్నారో తెలిపే పోస్టర్ వదిలారు. ఈ నెల 15 ఫస్ట్ లుక్‌, 18న ఫస్ట్‌ సాంగ్‌, 24న టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు ఓ ప్రీ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. 

వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిస్తున్నారు.  నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి అయ్యింది.

మరోపక్క ‘వి’ అనే సినిమాలోనూ నాని హీరో పాత్ర పోషిస్తున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఇందులో సుధీర్‌బాబు మరో  హీరో. నివేదా థామస్‌, అదితి రావు హైదరి హీరోయిన్స్.