Asianet News TeluguAsianet News Telugu

నాని 'టక్-జగదీష్' రిలీజ్ డేట్ ఫిక్స్?

 ఈ నెల మూడో వారం నుంచి సినిమాల రిలీజ్ లు ప్రారంభం అవుతున్నాయి. ఇష్క్, తిమ్మరసు సినిమాలు ఈ నెలలోనే రాబోతున్నాయి. ఈ నేఫధ్యంలో నాని నటించిన టక్ జగదీష్ కు కూడా విడుదల తేదీ ఫిక్స్ అయ్యిందని సమాచారం.

Nani and Ritu Verma's Tuck Jagadish was all set to release in theatres jsp
Author
Hyderabad, First Published Jul 10, 2021, 9:33 AM IST


‘నిన్ను కోరి’ వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో నాని, డైరెక్టర్‌ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్‌  హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యిపోవాలి. కానీ కరోనాతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్యన ఓటీటిలో వచ్చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టీమ్ ఖండించింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియోటర్స్ ఓపెన్ అవుతున్న వేళ... ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుద‌ల చేయాల‌ని ముందుగా నిర్మాత‌లు భావించిన‌ప్ప‌టికీ కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ఇప్పుడు ప‌రిస్థితులు కాస్త కుదుట‌ప‌డ‌టంతో నిర్మాత‌లు మ‌ళ్లీ సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్ర‌కారం ‘టక్ జగదీష్’ చిత్రాన్ని మేక‌ర్స్ ఆగ‌స్ట్ 13న విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయ‌ని ట్రేడ్ లో వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ విషయమై సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. 

ఇక ఈ సినిమాలో నాని చేస్తున్న పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందిట. సినిమాలో ఒక బైపోలార్ డిజార్డర్ క్యారెక్టర్ లో నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది.  బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో ఈ మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్జర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన అసంబద్ధ ప్రవర్తన చాలామందిలో ఉన్నా.. వారు ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించి.. చికిత్స తీసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి నేచురల్ పాత్రలో నాని జీవించబోతున్నారు.
 
అలాగే ఈ సినిమాలో ...నాని వాళ్లు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు. వాళ్లల్లో మధ్యవాడికిగా కనిపించే నానికి సినిమాలో టక్ జగదీష్ అనేది నిక్ నేమ్ అని తెలుస్తోంది. టక్ చేయటం అనేది ఓ టైమ్ లో చాలా పెద్ద ఫ్యాషన్. అంటే ఈ సినిమా కథ కూడా ఎనభైల్లోనో, తొంబైల్లోనో జరగనుందన్నమాట. అందుకే టక్ జగదీష్ అనే టైటిల్ ఫిక్స్ చేసారట.  

 షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటించనుంది. నాని కెరీర్‌ లో బెస్ట్ గా నిలిచిన  ఎవడే సుబ్రమణ్యం సినిమాలో  నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తూండటంతో ఇంట్రస్టింగ్ గా  మారింది.ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లో న‌టించారు.

Follow Us:
Download App:
  • android
  • ios