దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.. దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. చిన్న సైజ్ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకక్కనుంది. ఇప్పటికే సినిమాలో ఒక హీరోగా నానిని తీసుకున్నారని సమాచారం. 

దీనిపై అధికార ప్రకటన లేనప్పటికీ దిల్ రాజు కాంపౌండ్ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం నానిని హీరోగా ఫిక్స్ చేశారు. మరో హీరోగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో యంగ్ హీరో నిఖిల్ పేరుని పరిశీలిస్తున్నారు. గతంలో ఇంద్రగంటి.. నిఖిల్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు. 

వారాహి బ్యానర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సివుంది కానీ సెట్ కాలేదు. దీంతో ఇప్పుడు నిఖిల్ ని సెకండ్ హీరోగా తీసుకోవాలని భావిస్తున్నాడు. దిల్ రాజు కూడా నిఖిల్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు.

దాదాపు ఈ కాంబినేషన్ లో సినిమా ఖాయమని అంటున్నారు. నాని-నిఖిల్ హీరోలుగా ఇంద్రగంటి సినిమా అంటే అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాదిలో వీరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.