గత ఏడాది విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ 'హిట్' పాజిటివ్ టాక్ తో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ యాంగ్రీ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ మెన్ గా అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. హిట్ విశ్వక్ కి పరిశ్రమలో గుర్తింపు తీసుకువచ్చింది. డైరెక్టర్ శైలేష్ కొలను డెబ్యూ మూవీగా హిట్ తెరకెక్కించగా హీరో నాని నిర్మాతగా హిట్ తెరకెక్కించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై తెరకెక్కిన రెండవ చిత్రం హిట్. 


కాగా హిట్ చిత్రానికి సీక్వెల్ చేస్తున్నట్లు హీరో నాని కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. నేడు హిట్ సీక్వెల్ లో నటించే హీరో పేరు అధికారికంగా ప్రకటించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో అడివి శేషు హిట్ 2లో నటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని అడివి  శేషు తన సోషల్ మీడియా అధికారిక ఖాతా ద్వారా తెలియజేశారు. మేజర్ షూటింగ్ పూర్తి కాగానే హిట్ 2 సెట్స్ పైకి వెళుతుందని తెలియజేశారు. 


ఇక మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్ హీరోయిన్స్ గా నటిస్తుండగా హిట్ కి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను సీక్వెల్ కూడా తెరకెక్కించనున్నారు. నాని-అడివి శేషు హిట్ 2 కోసం మొదటిసారి కలిసిపనిచేస్తుండగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.