మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం గాంధీ జయంతి సందర్భంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే సైరా చిత్రానికి సూపర్ హిట్ టాక్ సొంతమైంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

సైరా రిలీజై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ సెలెబ్రిటీలు చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తాజాగా సైరా చిత్రం గురించి స్పందించాడు. ప్రస్తుతం నాని సౌత్ కొరియాలో ఉన్నాడు. 

నాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. నేను సౌత్ కొరియాలో ఉన్నా.. ఇక్కడ సైరా చిత్రాన్ని చూడడానికి ఎలాంటి అవకాశం లేదు. కానీ టాక్ వినిపించింది. ఇండియాలో బాక్సాఫీస్ ఘరానా మొగుడు ఈజ్ బ్యాక్ అని వినిపిస్తోంది. చిరంజీవి గారికి శుభాకాంక్షలు అని నాని ట్వీట్ చేశాడు. 

నాని నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి టాకే వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్నాడు. 'V' అనే టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది.