Asianet News TeluguAsianet News Telugu

Nani31కి ముహూర్తం ఫిక్స్... ఆ డైరెక్టర్ తో వన్స్ మోర్.. డిటేయిల్స్

నేచురల్ స్టార్ నాని నెక్ట్స్ సినిమాపై అఫీషియల్ అప్డేట్ అందించారు. తాజాగా 31వ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ అందించారు. 
 

Nani 31 movie announcement official NSK
Author
First Published Oct 21, 2023, 12:13 PM IST

నేచురల్ స్టార్ నాని త్వరలో ‘హాయ్ నాన్న’ (Hai nanna) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. తండ్రి కూతురి సెంటిమెంట్ తో పాటు బ్యూటీఫుల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు పంచబోతున్నారని తెలుస్తోంది.  నాని చిత్రాలో ఈ సినిమా కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని భావిస్తున్నారు. చివరిగా నాని ‘దసరా’తో మంచి రిజల్ట్ ను చూశారు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అంచనాలు ఉన్నాయి. 

అయితే, ‘హాయ్ నాన్న’ చిత్రం ఇక తెరమీదకు రాకముందే.. నాని మరో ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టారు. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయా (Vivek Athreya) తో తన 31వ సినిమాను కన్ఫమ్ చేశారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘అంటే.. సుందరానికీ’ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా మరోసారి ఆ డైరెక్టర్ తోనే నాని31వ సినిమా పట్టాలెక్కబోతుండటం విశేషం. 

ఈరోజు Nani31 సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అందించారు.  అక్టోబర్ 23న, 24న ఈ చిత్రానికి సంబ:ధించి అఫీషియల్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 24న సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్, ఫన్ తదితర అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. మిగితా వివరాలను త్వరలో అందించనున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios