`ఆర్‌ఆర్‌ఆర్‌`లో నాటు నాటు సాంగ్‌ ఎంతగా దుమ్ములేపుతుందో తెలిసిందే. దీని క్రేజ్‌ ఆగడం లేదు. తాజాగా `నాండీ` సిస్టర్స్ దీన్ని రీ క్రియేట్‌ చేశారు.  ఊరమాస్‌ డాన్సులతో పిచ్చెక్కించారు.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా విడుదలై నాలుగు నెలలు పూర్తయినా ఆ సినిమా ప్రభావం జనాల్లో ఇంకా ఉండిపోయింది. ముఖ్యంగా పాటల, యాక్షన్‌ సీన్లు వరల్డ్ వైడ్‌గా వైరల్‌ అవుతున్నాయి. రీల్స్ మాత్రం కోకొల్లలుగా వస్తున్నాయి. సినీ ప్రియులు, చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ఇలా ఏజ్‌తో సంబంధం లేకుండా `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని పాటలకు డాన్సు చేస్తూ తమ ప్రతిభని చాటుకుంటున్నారు. సినిమాపై తమకున్న ప్రేమని తెలియజేస్తున్నారు. అందులో `నాటు నాటు` సాంగ్‌ వరల్డ్ వైడ్‌గా ఎంతగా ఊపేస్తుందో తెలిసిందే. 

తాజాగా ఇద్దరు సిస్టర్స్ `నాటు నాటు` పాటని పూర్తిగా రీక్రియేట్‌ చేశారు. వాళ్లే మ్యూజిక్‌ వాయిస్తూ, పాట పాడుతూ డాన్సు చేయడం విశేషం. `నాటు నాటు` పాటకి అదిరిపోయేలా డాన్సు చేశారు.ఊరమాస్‌ డాన్సుకి, వారి ఎక్స్‌ ప్రెషన్స్ కి, పాట పాడే విధానం నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే సినిమాలోని పాట కంటే వీరి క్రియేట్‌ చేసిన పాటే ఓ రేంజ్‌లో ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. 

అంతారా నాండీ, అంకిత నాండీ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఈ పాటని రీ క్రియేట్‌ చేశారు. వీరి అంతకు ముందే మాషప్‌ స్కిట్లు, వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో పాపులారిటీని పొందారు. తాజాగా వీరి నాటునాటు సాంగ్‌ మరింతగా వైరల్‌ అవుతుంది. అయితే వీరిద్దరు చూడ్డానికి ట్విన్స్ లా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే `ఆర్‌ఆర్‌ఆర్‌`లో `నాటు నాటు` సాంగ్‌ని రాహుల్‌ సిప్లిగంజ్‌, కాళభైరవ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు.

View post on Instagram

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం మే 25న విడుదలై సంచలన విజయం సాధించింది. 450కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 1150కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోనే ఎక్కువ రోజులు నెంబర్‌ వన్‌ స్లాట్‌లో స్ట్రీమింగ్‌ అయిన చిత్రంగానూ రికార్డు క్రియేట్‌ చేసింది.