Asianet News TeluguAsianet News Telugu

Intinti Gruhalakshmi: తులసికి సేవలు చేస్తున్న నందు.. దగ్గరవుతున్న విక్రమ్, దివ్య?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 21 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

Nandu takes good care of tulasi in todays intinti Gruhalakshmi serial gnr
Author
First Published Mar 21, 2023, 9:23 AM IST

ఈరోజు ఎపిసోడ్లో దేవుడు చేసేదేమీ లేదు. నీకు తగ్గట్టు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వస్తారు ఆ అమ్మాయికి పెళ్లి చేసి జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవడమే అని అంటాడు. అప్పుడు విక్రమ్ తెలివిగా నువ్వు చెప్పినట్టే చేసుకుంటాను అన్నాను కానీ నువ్వు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అమ్మకు మాట ఇవ్వలేదు కదా అని అంటాడు. ఏం చెప్పారు బాబు ఇంకొకసారి చెప్పండి అనడంతో నేను ఇష్టపడ్డ అమ్మాయిని అమ్మ కూడా ఇష్టపడేలా చేసి పెళ్లి చేసుకుంటాను అని అంటాడు విక్రమ్. దేవుడు రాసిన రాతను ఎవరు తప్పించలేరు అనడంతో ఇంట్లో దేవుడు ఎవరు కాదు మీ అమ్మగారు అది పెద్దమ్మ గారు అని అంటాడు దేవుడు. లేస్తే వెళ్లి కూరగాయలు తీసుకుని వద్దాము అనగా మొదటి అడుగు నా మనసులో మాట దివ్యకి చెప్పడం.

రెండో అడుగు దివ్య మనసులో నేను ఉన్నాను లేదో తెలుసుకోవడం మూడో అడుగు దివ్యని అమ్మకు పరిచయం చేయడం నాలుగో అడుగు ఇద్దరము కలిసి పెళ్లి చేసుకుని ఆడడంతో ఇప్పుడు నువ్వు ఒక అడుగు బయటకు వేస్తే కూరగాయలకు వెళ్దాం బాబు అంటాడు దేవుడు. నువ్వు రావా అనడంతో నన్ను డాక్టర్ కొద్ది రోజులు పని చేయద్దు అని చెప్పారు బాబు అనగా కోపంగా చూడడంతో అలా చూడకండి బాబు నేను కూడా వస్తాను అని అంటాడు. మరొకవైపు నందు తులసీ ఏమైంది పొద్దునుంచి కనిపించడం లేదు రాత్రి జరిగింది దానికి ఏమైనా కోపం తెచ్చుకుందా అనుకుంటూ ఉంటాడు.. లోని అనసూయ ఎక్కడికి రావడంతో అమ్మ తులసికి ఏమైంది కనిపించడం లేదు అంటుండగా ఇంతలో వాసుదేవ్ అక్కడికి వచ్చి తులసికి జ్వరం వచ్చి మూసిన కన్ను తెరవకుండా అలాగే పడుకుంది అనడంతో నందు టెన్షన్ గా లోపలికి వెళ్లి జ్వరం వస్తోంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

తర్వాత నందు నీళ్లు తీసుకుని వచ్చి తులసికి తడి బట్ట వేస్తూ సేవలు చేస్తూ నేను తులసికి భర్తగా ఉన్నప్పుడు తనను ఎంతో బాధ పెట్టాను తన మనసును గాయపెట్టాను అనుకుంటూ కన్నీరు పెట్టుకుంటాడు నందు. బట్టగా ఉన్నప్పుడు ఏ సంతోషం ఇవ్వలేదు విడాకులు తర్వాత కూడా నీకు మనశ్శాంతి ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే తులసి నిద్ర లేవడంతో టాబ్లెట్స్ ఇచ్చి సేవలు చేస్తూ ఉంటాడు. అది చూసి లాస్య కోపంతో రగిలిపోతూ అక్కడికి వస్తుంది. తులసికి జ్వరము వచ్చిందా లేకుంటే నువ్వే కావాలని తెప్పించావా అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది లాస్య. నందు కోపంతో రగిలిపోతుండగా తులసి సైలెంట్ గా ఉండమని చెబుతుంది.

నెక్లెస్ చాలా బాగుంది తులసి నా దిష్టి తగిలినట్టు ఉంది అందుకే మంచాన పడ్డావుఅంటుంది లాస్య. ఎంతసేపు తులసీనే కాదు నందు మనకు కేఫ్ ఉంది కూడా పట్టించుకో అని అంటుంది లాస్య. బయలుదేరుదామా అనగా ఇంతలో వాసుదేవ్ అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్లాలి అనగా కేఫ్ దగ్గరికి వెళ్లాలి కదా అనగా కట్టుకున్న భార్య కంటే ఏది ముఖ్యం కాదు అని అంటాడు వాసుదేవ్. కట్టుకున్న వాడికి విడాకులు ఇచ్చిన వాళ్లకు ఇలాంటివి అర్థం కావులే అయినా లాస్యని పనిలో ఎందుకు పెట్టుకున్నావు నందు నీ మీద అజమాయిషి చేయడానికి అని అంటాడు అసదేవ్. అర్థమైంది సార్ మీరు ఇక్కడ దగ్గరుండి చూసుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వాసుదేవ్ భార్యకు మందులతో జ్వరం మూడు రోజులకు తగ్గితే భర్త ప్రేమతో కేవలం ఒక్కరోజులోనే తగ్గిపోతుంది అని అంటాడు.

పొద్దున్నుంచి ఏమీ తినలేదు కనీసం సూప్ అయినా చేసి పెట్టు అని సలహా ఇవ్వడంతో సరే అని అంటాడు. ఆ తర్వాత దేవుడు ఇప్పుడు ఒకవేళ మీకు దివ్యమ్మ కనిపిస్తే ఏం చేస్తారు బాబు అనగా ఆశకు కూడా హద్దు ఉండాలి అనగా ఒకసారి అటు చూడండి బాబు అనగ దివ్య ను చూసి కారు నుంచి దిగి పరిగెడతాడు విక్రమ్. మీరు కూడా కూరగాయలు కొనడానికి వచ్చారా అని అంటుంది దివ్య. నాకు కూరగాయలు కొనడం హాబీ అంటూ కూరగాయలు కొనడంలో కూడా ఒక మెలకువ ఉండాలి కూరగాయల గురించి వివరిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఇలా కూరగాయల గురించి చెబితే మీరేదో మెస్ లో పనిచేస్తున్నారు అనుకుంటుంది అని అంటాడు.

 అయినా మీరు ఇలా ఎందుకు వచ్చారు నాకు తెలుసులెండి పని వాళ్ళ మీద నమ్మకాలు లేక మీరే ఇలా కొనడానికి వచ్చారు కదా అని అంటుంది. అమ్మాయి గారు అదృష్టవంతురాలు అనడంతో ఎవరు అదృష్టవంతురాలు అనగా మిమ్మల్ని చేసుకోబోయే వాడు అని అనగా విక్రమ్ సిగ్గుపడుతూ ఉంటాడు. ఆ తర్వాత దివ్య విక్రమ్ ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తుండగా ఇంతలో భాగ్య అక్కడికి వచ్చి దివ్యని చూసి సంతోష పడుతూ ఉంటుంది. అప్పుడు దివ్య దగ్గరికి వెళ్దాము అనుకుంటుండగా ఆ పక్కన ఎవరో ఉండడం చూసి ఇదేదో లాస్యకీ పనికొచ్చే విషయంలా ఉంది అని లాస్యకు ఫోన్ చేస్తుంది.

అప్పుడు లాస్యకు జరిగింది మొత్తం వివరిస్తుంది భాగ్య. తర్వాత దివ్య నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు మీకు చెప్తున్నాను నాకు వంట వచ్చే అబ్బాయి అంటే చాలా ఇష్టం విక్రమ్ సంతోషపడుతుంటాడు. ఇంతలో  దేవుడు విక్రం బాబు మీరు కూడా మీకు ఎలాంటి అమ్మాయి అంతే ఇష్టమో చెప్పేయండి అని అంటాడు. చెప్పండి మీలాంటి అబ్బాయి ఎటువంటి అమ్మాయిని కోరుకుంటాడో తెలుసుకోవాలని ఉంది అని అంటుంది దివ్య. సన్నగా నాజూగ్గా లేతగా పొట్లకాయలాగా ఉండాలి అనగా దేవుడు సెటైర్లు వేస్తూ ఉంటాడు. దివ్య ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుండగా లాస్య భాగ్య ఇద్దరూ దివ్య విక్రమ్ ల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య విక్రమ్ ల ఫోటోలు తీస్తూ ఉంటుంది భాగ్య.

అప్పుడు దివ్య టైర్ పంచర్ అవ్వడంతో సరే ఎలాగో అలా ఆటోకు వెళ్తాను లేంది అని అనగా ఆటో వెళ్లడం ఏంటండీ నా కారు ఉంది కదా కారులో వెళ్దాం పదండి అని విక్రమ్ దివ్యని పిలుచుకొని వెళ్తాడు. ఆ తర్వాత నందు కిచెన్ లోకి వెళ్లి కాసేపు స్టవ్ కావాలి అనగా ఏమైనా కావాలా బాబు అనగా కాసేపు స్టవ్  కావాలి తులసికి జ్వరంగా ఉంది కదా ఏమి తినలేదు. సూప్ చేయాలి అనుకుంటున్నాను నీకు సూప్ ఎలా చేయాలో తెలియదు కదా అని అంటాడు నందు. చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మీకోసం ఎప్పుడు మీరు ఏమి చేయలేదు? అలా అని లాస్యమ్మ కోసం కూడా చేయలేదు తులసమ్మ గారి కోసం ప్రేమగా ఇలా సూప్ చేస్తున్నారు అని అంటుంది.

 అప్పుడు రాములమ్మ మాటలకు నందు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత నందు సూప్ చేస్తుండగా రాములమ్మ అది చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నందు సూప్ తీసుకొని తులసి గదిలోకి వెళ్తాడు. అన్నయ్య ఏదో సరదాగా అంటే మీరు ఎందుకు తీసుకుని వచ్చారు అనడంతో నేను కూడా సరదాగా చేశాను లక్కీగా బాగానే వచ్చింది అనడంతో తులసి నవ్వుతూ ఉంటుంది. నేను తాగిస్తాను తాగు అని అనడంతో తులసి బాగానే ఉంది అనగా నువ్వు సర్టిఫికెట్ ఇచ్చావు అంటే బాగానే ఉంటుంది అని అంటాడు నందు.

Follow Us:
Download App:
  • android
  • ios