తెలుగు తెరపై రీమేక్ సినిమాల హవా పలు రిమేక్ చిత్రాల్లో నటించిన విక్టరీ వెంకటేష్ మరో రిమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకటేష్ 

ఒక భాషలో విజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేయడం సర్వసాధారణం. తెలుగులో రీమేక్ కథలను ప్రోత్సహించే హీరోల్లో వెంకటేష్ ముందుంటారు. ఆ సినిమా కథ డిఫరెంట్ గా ఉండి ప్రజలను ఆకట్టుకునేలా ఉంటే.. ఆయన కచ్చితంగా ఆ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చినవే ‘ బాడీగాడ్’, ‘ దృశ్యం’, ‘ గురు’,‘ గోపాల గోపాల’.

తాజాగా ఆయన మరో రీమేక్ సినిమాలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ లో ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘ హిందీ మీడియం’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారట. మాతృకలో ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించగా.. తెలుగులో ఆ పాత్ర వెంకీ పోషిస్తారని సమాచారం.

ఈ చిత్రానికి మహిళా డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారట. ఈ చిత్రానికి ‘ తెలుగు మీడియం’ అనే పేరును ఖరారు కూడా చేశారట. మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారని.. ఇందులో నటించడానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.