తొలి చిత్రం అలా మొదలైందితో కొత్త తరహా కామెడీకు శ్రీకారం చుట్టిన నందీనీ రెడ్డి తర్వాత కెరీర్ పరంగా కాస్త వెనకబడ్డారు. జబర్దస్త్, కళ్యాణ వైభోగమే చిత్రాలు ఆమెకు గత వైభవాన్ని తేలకపోయాయి. అయితే రీసెంట్ గా చేసిన ఓ బేబి సినిమా మాత్రం నందినీ రెడ్డికు బాగా ప్లస్ అయ్యింది. ఈ సినిమా మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  ఈ నేపధ్యంలో నందినీ రెడ్డి తన తదుపరి ప్రాజెక్టుకు రంగం సిద్దం చేసుకుంటోంది. 

అందుతున్న సమాచారం మేరకు సక్సెస్ మీట్ తర్వాత కలిసిన నందినీరెడ్డి ...తను నెక్ట్స్ చేయబోయే సినిమాకు సంభందించి ఓ స్టోరీ లైన్ చెప్పిందిట. అదీ హీరోయిన్ ఓరియెంటెండ్ కథాంశం కావటంతో ఎవరితో అనుకుంటున్నావ్ అని అడిగిందట. దానికి నందినీరెడ్డి ..నిన్ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను అని చెప్పింది. వెంటనే సమంత ..మనం మళ్లీ ఇంకో హిట్ కొట్టబోతున్నాం.

బౌండ్ స్క్రిప్టు తీసుకుని రా సినిమా స్టార్ట్ చేసేద్దాం అని హామీ ఇచ్చిందిట. అయితే ఈ సారి కామెడీ కాకుండా థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. అయితే అది కూడా పూర్తిగా డిఫరెంట్ గా ఉండేలా నందినీ రెడ్డి ప్లాన్ చేసిందని సమాచారం. సమంత, నందినీ రెడ్డి సినిమా అంటే నిర్మాతలకు కొదవేముంటుంది. 

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ఓ బేబీ' . మొన్న శుక్రవారం (5వ తేదీన) ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ఈ చిత్రం  కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా తెరకెక్కింది.  రిలీజైన తొలి రోజు మార్నింగ్ షో కే  సూపర్ హిట్  టాక్ తెచ్చుకుంది. నటన పరంగా సమంత ఫుల్ మార్కులు కొట్టేసిందని అందరూ మెచ్చుకున్నారు. మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి.