Nandi Awards : నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy నంది అవార్డ్స్ Nandi Awardsపై కీలక ప్రకటన చేశారు. పేరును మార్పు చేస్తూ త్వరలోనే జీవో విడుదల చేస్తామని చెప్పారు.
తెలుగు చలన చిత్ర సీమలో అత్యున్నత పురస్కారం... నంది పురస్కారం (Nandi Awards). 1964 నుంచి ఈ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేస్తూ వస్తోంది. చివరిగా 2016లో పురస్కారాలను అందజేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో.. దాదాపు ఎనిమిదేళ్లు ఈ అవార్డుల ఊసే లేదు. దీనిపై ఎన్నో మార్లు సినీ ప్రముఖులు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ పెద్ద పండగ ఆగిపోయినట్లైంది. ఇక తాజాగా నంది అవార్డులపై సీఎం రేవంత్ రెడ్డి Revanth Reddy కీలక ప్రకటన చేశారు.
నంది అవార్డులపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు తను సీఎం అయ్యాక కలిశారన్నారు. ప్రధానంగా నంది అవార్డుల విషయాన్నే విన్నవించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే నంది అవార్డులను ఇకపై గద్దర్ అవార్డ్స్ Gaddar Awardsగా ప్రకటిస్తామన్నారు. ఇకపై అధికారికంగా గద్దర్ పైనే అవార్డులు వస్తాయన్నారు. తన మాటే శాసనమని, జీవో అని హామీనిచ్చారు. దీంతో సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధత్యలు తీసుకున్న తర్వాత సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, పలువురు నిర్మాతలు కలిసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలోని ఆయా అంశాలను, సమస్యలను ఆయన ద్రుష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఇక ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేయబోతుండటంతో ఆయన ప్రత్యేక గౌరవం దక్కింది. దీనిపై మున్ముందు మరిన్ని వివరాలు అందనున్నాయి.