అలా మొదలైంది సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందిని రెడ్డి ఎట్టకేలకు మరో సక్సెస్ అందుకుంది. ఆమె డైరెక్ట్ చేసిన నాలుగవ సినిమా ఓ బేబీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సమంతతో చేసిన ఓ బేబీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని రివ్యూలు వస్తున్నాయి. 

అయితే ఆమె నెక్స్ట్ మూవీని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కించనుందట. దేవదాస్ సినిమాతో కాస్త తడబడ్డ వైజయంతి సంస్థ నెక్స్ట్ సినిమాను నందిని రెడ్డితో ప్లాన్ చేస్తోంది. రీసెంట్ గా ఓ బేబీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నందిని రెడ్డి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఒక స్టార్ హీరోతోనే నెక్స్ట్ పనిచేయబోతున్నాట్లు ఆమె వివరణ ఇచ్చారు. 

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా సాగే ఆ కథలో మాస్ అంశాలు కూడా గట్టిగానే ఉంటాయట. ఓ బేబీ హడావుడి తగ్గాక త్వరలోనే ఆ స్టార్ హీరో ఎవరనే విషయాన్నీ చెబుతానని నందిని రెడ్డి తెలిపారు.