Tarakaratna : తారకరత్నపెద్దకర్మ.. బాలకృష్ణ, విజయ్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు.. పూర్తి వివరాలు!
టాలీవుడ్ నటుడు, నందమూరి తారకరత్న (Taraka Ratna) పెద్దకర్మకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా కుటుంబ సభ్యులు ప్రకటించారు.
టాలీవుడ్ నటుడు, టీడీపీ లీడర్ నందమూరి తారకరత్న అతి చిన్న వయస్సులో మరణించిన విషయం తెలిసిందే. గుండెపోటుతో 22 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడారు. ఫారేన్ వైద్యులతోనూ ట్రీట్ మెంట్ అందించినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఈనెల 18న శనివారం సాయంత్రం కన్నుమూశారు. చికిత్స స్పందిస్తున్నారని కుటుంబ సభ్యులు తెలపడంతో.. మళ్లీ తారకరత్న సాధారణ స్థితిలోకి వస్తాడని అంతా భావించారు కానీ చివరికు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు.
ఆయన మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర శోఖసంద్రంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 18న తారకరత్న మరణించగా.. రెండ్రోజుల తర్వాత జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో తారకరత్న అంతిమ సంస్కారాలు ముగిశాయి. తండ్రి మోహనక్రిష్ణ చేతుల మీదుగా అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర నిర్వహించి వీడ్కోలు పలికారు. ఇక రీసెంట్ గా తారకరత్న చిన్న కర్మను కూడా నిర్వహించారు. తాజాగా పెద్దకర్మకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
తారకరత్న పెద్దకర్మకు సంబంధించిన ఏర్పాట్లను ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించనున్నట్టు తెలిపారు. మార్చి 2, 2023 మంగళవారం మధ్యాహ్నాం 12 గంటలకు పెద్దకర్మ జరుగుతుందని తెలిపారు. నందమూరి బాలయ్య, విజయసాయి రెడ్డి కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం విశేషం. ఈమేరకు అందరూ వచ్చి తారకరత్నకు నివాళి అర్పించాలని కోరారు. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, పిల్లలు, నందమూరి కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తున్నట్టుగా ప్రకటన విడుదల చేశారు.
తారకరత్న గతనెల 25న టీడీపీ నేత లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్నారు. అదేరోజు తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని హ్రుదయాలయానికి తరలించారు. అక్కడ అత్యధునిక చికిత్సను అందించినా ఫలితం లేకుండా పోయింది. అన్నీ తానై చూసుకున్న బాలయ్య ఆరాటానికి నిరాశే ఎదురైంది. ఇక తారకరత్న మరణంతో ఆయన పిల్లల భవిష్యత్ బాధ్యతను బాలయ్య తీసుకోవడం విశేషం. ఇక అలేఖ్య రెడ్డికి పదవి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.