సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం అయింది. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమ య్యాత్ర సాగుతుంది.
సినీ నటుడు తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం అయింది. కుటుంబ సభ్యులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య అంతిమ య్యాత్ర సాగుతుంది. ఫిల్మ్‌ఛాంబర్ నుంచి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానం వరకు తారకరత్న అంతియాత్ర సాగనుంది. మరికాసేపట్లో మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. అంతకు ముందు ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయానికి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. తారకరత్న భౌతికకాయం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఫిల్మ్‌చాంబర్ వద్ద తారకరత్న భౌతికకాయాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు అలా చూసి తట్టుకోలేకపోయారు. మరోవైపు తారకరత్న సతీమణి అలేఖ్య పూర్తిగా విషాదంలో మునిగిపోయారు. చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, వెంకటేశ్, సురేష్ బాబు, ఆదిశేషగిరి రావు, బుర్రాసాయి మాధవ్, అనిల్ రావిపూడి, చింతమనేని ప్రభాకర్ రావు.. తదితరులు ఫిల్మ్‌ఛాంబర్‌కు చేరుకుని తారకరత్నకు కడసారి నివాళులర్పించారు. మరోవైపు తారకరత్నకు కడసారి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున ఫిల్మ్‌చాంబర్‌కు తరలివచ్చారు.
అనంతరం అక్కడే తారకరత్న భౌతికకాయానిక అంతిమ క్రతువు నిర్వహించారు. తారకర్నత పిల్లల చేత ఆయన భౌతికకాయానికి నమస్కారం చేయించారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర భావోద్వేగ వాతావరణం నెలకొంది. అనంతరం తారకరత్న భౌతికకాయాన్ని మహాప్రస్తానం వాహనంలో ఎక్కించారు. ఆ వాహనంలోనే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇక, మరికాసేపట్లోనే జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్తానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్న అంత్యక్రియలకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.
