నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞని హీరోగా లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం అతడి శరీరాకృతి విషయంలో బాలయ్య కొన్ని నియమాలు విధించాడట. అలానే గుర్రపు స్వారీ, నటనలో శిక్షణ కోసం పంపిస్తే ఇప్పటివరకు మోక్షజ్ఞ వాటిని పూర్తి చేయలేదని తెలుస్తోంది.

మధ్యలోనే వాటిని వదిలేసినట్లు సమాచారం. నటించడం కంటే ఫిల్మ్ మేకింగ్ పై మోక్షజ్ఞ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే హీరోగా లాంచ్ చేయడానికి కావాల్సిన ఏపనిని కూడా మోక్షజ్ఞ పూర్తి చేయడం లేదని అంటున్నారు.

ఒకానొక దశలో బాలయ్య.. 'ఎన్టీఆర్' బయోపిక్ ద్వారా మోక్షజ్ఞని లాంచ్ చేయాలనుకున్నారు. కానీ అది మోక్షజ్ఞ డెబ్యూకి సరికాదని ఆ ఆలోచనని విరమించుకున్నారు. ఇప్పటికే  దర్శకుడు క్రిష్.. మోక్షజ్ఞని పెర్ఫెక్ట్ బాడీ షేప్ లోకి వస్తే సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాడు.

మోక్షజ్ఞ డెబ్యూ కోసం బోయపాటిని కూడా సంప్రదించాడు బాలయ్య. కానీ ఇప్పుడు బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కావడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని అంటున్నారు.