తారకరత్న త్వరగా కోలుకోవాలి.. ‘అమిగోస్’ అప్డేట్స్ ను వాయిదా వేసిన కళ్యాణ్ రామ్!
నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు.

నిన్న (జనవరి 27న )కుప్పంలో నిర్వహించిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారని. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రులలో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం విడుదలైన హెల్త్ బులిటెన్ లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. దీంతో నందమూరి అభిమానులు ఆందోళన పడుతున్నారు.
తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తారకరత్న ఆరోగ్యంపై స్పందించారు. ‘నా సోదరుడు శ్రీ నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా తారకరత్న కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో 10 మందితో కూడిన డాక్టర్ల టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని క్షణక్షణం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు.
తన సోదరుడు ఆరోగ్యం విషయంగా ఉండటంతో తారకరత్న తన సినిమాలకు సంబంధించిన అన్ని పనులను ఆపేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం అవుతున్న ‘అమిగోస్’ చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ నిన్న ‘ఎన్నో రాత్రలొస్తాయి గానీ’ అనే రీక్రియేట్ సాంగ్ ప్రొమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ రేపు సాయంత్రం విడుదల కావాల్సి ఉంది. అయితే తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గా ఉండటంతో సినిమా ప్రమోషన్స్ ను వాయిదా వేసినట్టు తెలిపారు మేకర్స్. ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అప్డేట్ ను పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న హెల్త్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నారు. బాలయ్య నిన్నటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అంతా ఆందోళన చెందుతున్నారు.