Asianet News TeluguAsianet News Telugu

కరోనా దెబ్బ: కళ్యాణ్ రామ్ కు రెండు కోట్లు నష్టం


కరోనా ప్రభావంతో చాలా సినిమాలు షూటింగ్ లు ఆగిపోయాయి. అంతేకాదు ఆ సినిమాల కోసం వేసిన సెట్స్ సైతం తీసేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. అలాంటి వాటిల్లో పవన్, క్రిష్ కాంబినేషన్ లో ప్రారంభమైన విరూపాక్ష, చిరు ఆచార్య ఉన్నాయి. ఆ సినిమా సెట్స్ పై భారీగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సైతం తన తాజా చిత్రం విషయంలో రెండు కోట్లు దాకా నష్టపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Nandamuri Kalyan Ram Tughlaqs 2 crore worth set damaged
Author
Hyderabad, First Published Jul 23, 2020, 8:04 AM IST


కరోనా ప్రభావంతో చాలా సినిమాలు షూటింగ్ లు ఆగిపోయాయి. అంతేకాదు ఆ సినిమాల కోసం వేసిన సెట్స్ సైతం తీసేయాల్సిన పరిస్దితి ఏర్పడింది. అలాంటి వాటిల్లో పవన్, క్రిష్ కాంబినేషన్ లో ప్రారంభమైన విరూపాక్ష, చిరు ఆచార్య ఉన్నాయి. ఆ సినిమా సెట్స్ పై భారీగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సైతం తన తాజా చిత్రం విషయంలో రెండు కోట్లు దాకా నష్టపోయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
 
డిఫరెంట్ గా ఉన్న పాయింట్స్, కథల ఎంపికలో కళ్యాణ్ రామ్ ఎప్పుడూ వెనకాడరు. అయితే చిత్రంగా  కళ్యాణ్ రామ్ కి `పటాస్` తర్వాత మళ్లీ ఆ స్దాయి పెద్ద హిట్ లేదు. 118 చిత్రం వెరైటీగా బావుందని పేరొచ్చినా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అనిపించుకుంది. ఆ తర్వాత శతీష్ వేగెష్న దర్శకత్వంలో చేసిన ఎంత మంచి వాడివిరా సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం కీలకంగా మారింది. కొత్త దర్శకుడు మల్లిడి వేణు డైరెక్షన్‌లో సోషియే ఫాంటసీ సినిమాలో నటించబోయే సినిమాపై కల్యాణ్‌ రామ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. 

తుగ్లక్ టైటిల్ తో రూపొందే ఈ సినిమా కథాంశం సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో పెద్ద సెట్ వేసారు. దాదాపు రెండు కోట్ల రూపాయలు వెచ్చించారు. ఓ వారం షూటింగ్ కూడా జరిపారు. అయితే ఈ లోగా కరోనా దెబ్బతో ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోయాయి. చూస్తూంటే షూటింగ్ లు ప్రారంభం కావటానికి చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. ఈ నేపధ్యంలో అక్కడ సెట్ నిమిత్తం అద్దెలు కట్టడం ఎందుకని, దాన్ని తీసేసారు. దాంతో రెండు కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లైంది. 

 మరో ప్రక్క ఫాంటసీ సినిమా కావటంతో బడ్జెట్ కూడా కాస్త ఎక్కువే అవుతుందని తెలుస్తోంది. ఈ కారణంగానే వేరే నిర్మాతకు రిస్క్‌ లేకుండా ఈ సినిమాను తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పై తెరకెక్కించే ఆలోచన చేసారు కల్యాణ్‌ రామ్‌. 13 వ శతాబ్దం నేపధ్యంలో ఈ చిత్రం కథ కొంత జరగనుంది. మల్లిడి వేణు సినిమాను ముందుగా అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేశాడట. కానీ ఫైనల్‌ కల్యాణ్ రామ్‌ ఓకె చెప్పటంతో  కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు మార్పులు , చేర్పులతో స్క్రిప్ట్ రెడీ చేసారట. కరోనా తీవ్రత తగ్గి మళ్లీ అంతా సెట్ రైట్ అయ్యేకే షూటింగ్ అని తెలుస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios