2017లో జైలవకుశలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేశాడు. మూడేళ్ల తర్వాత అన్నకల్యాణ్ రామ్‌ తమ్ముడు తారక్‌ను ఫాలో అవుతూ తను త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. మూమూలుగానే... మూడు పాత్రలను చేయడమంటే సులభమైన విషయం కాదు. క్యారక్టర్స్ మేకోవర్ లో వేరియోషన్ మాత్రమే కాదు..డైలాగుల దగ్గర నుంచీ మొత్తం విభిన్నంగా ఓ పాత్రకు మరో పాత్రకు సంభందం లేనట్లుగా డిజైన్ చేసుకోవాలి. హీరో ఎక్కువ హోమ్ వర్క్ చేయాలి. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌, చిరంజీవి వంటి స్టార్స్ తర్వాత నేటి తరంలో త్రిపాత్రాభినయం చేసిన స్టార్‌ తారక్‌ మాత్రమే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సైతం ఈ ప్రయోగం చేయబోతున్నట్లు సమాచారం.  

వివరాల్లోకి వెళితే...ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు కల్యాణ్‌రామ్‌ రీసెంట్‌గా ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు.  భారీ చిత్రాలను నిర్మిస్తూ తెలుగులో  అగ్ర నిర్మాణ సంస్థగా ఎదుగుతున్న మైత్రీ మూవీ మేకర్స్‌ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సంస్థ భారీ చిత్రాల మధ్యలో మీడియం బడ్జెట్‌ సినిమాలను నిర్మిస్తుంటుంది. ఇలా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనున్న మీడియం బడ్జెట్‌ మూవీలో నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించబోతున్నాడని టాక్.  

రాజేంద్ర అనే కొత్తగా పరిచయం అవుతున్న డైరెక్టర్‌ ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా కథను సిద్ధం చేశాడట. కథ నచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌ నందమూరి కల్యాణ్‌రామ్‌ అయితే బావుంటుందని ఆయన్ని అప్రోచ్‌ అయ్యారట. ఆయన కథ వినగానే నచ్చడంతో ఓకే చెప్పేశాడట. అలా కళ్యాణ్ రామ్ కు త్రిపాత్రాభినయం సినిమా సెట్ అయ్యింది. అంతవరకూ బాగానే ఉంది. మూడు పాత్రలకు కళ్యాణ్ రామ్ జస్టిఫై చేసేటంత స్టామినా ఉందనేదే సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ డిస్కషన్ గా మారిన విషయం.