దిల్ రాజు నిర్మాతగా కళ్యాణ్ రామ్ చిత్రం,టైటిల్ ఇదే?
ప్రస్తుతం కల్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్ వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో దిల్ రాజ్ ప్రొడక్షన్లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘డు ఆర్ డై’ అని టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది.
నిర్మాత.. నటుడు కళ్యాణ్ రామ్ తన కెరీర్ ప్రారంభం నుంచి హిట్,ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు. `ఓం -3డి` లాంటి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి అందులో కనిపించారు. అలాగే సోదరుడు ఎన్టీఆర్ హీరోగా `జైలవకుశ` లాంటి విభిన్నమైన చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే 118 లాంటి నవ్యపంథా సినిమాతో నటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత విడుదలైన ఎంత మంచివాడవురా సినిమా ఆశించనంతగా సక్సెస్ కాలేకపోయింది.కేవలం కమర్షియల్ సక్సెస్ అనే కోణంలోనే కాకుండా వైవిధ్యం కోసం పాకులాడే హీరోగా కళ్యాణ్ రామ్ ని అందరూ గుర్తు పెట్టుకుంటున్నారు. అందుకే అతడు నటిస్తున్న తాజా సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం కల్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్ వశిష్టతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లుగా సమాచారం. అదే సమయంలో దిల్ రాజ్ ప్రొడక్షన్లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తుంది. ఈ సినిమాకు ‘డు ఆర్ డై’ అని టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి.. ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది.
కేవలం ఈ రెండు సినిమాలే కాకుండా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కూడా కల్యాణ్ రామ్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం. అలాగే సొంత బ్యానర్ లో పలు వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు కళ్యాణ్ రామ్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 118 లాంటి ప్రయోగం తర్వాత కళ్యాణ్ రామ్ కథల విషయంలో కాస్తంత విభిన్నంగానే ఆలోచిస్తున్నారని అతడి ఎంపికలు చెబుతున్నాయి.