Asianet News TeluguAsianet News Telugu

మూడు పాత్రల్లో నందమూరి కల్యాణ్ రామ్.. ప్రయోగం ఫలించేనా..?

బింబిసార సక్సెస్ తో మంచి జోష్ వచ్చింది కల్యాణ్ రామ్ కు. ఇక మరికొన్ని ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు నందమూరి హీరో. ఈసారి మూడు పాత్రల్లో మెరవబోతున్నాడట.. మరి ఈ ప్రయోగం కలిసొచ్చేనా..?
 

Nandamuri Kalyan Ram New Movie Update
Author
First Published Oct 13, 2022, 7:09 AM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా తను నమ్మిన సిద్థాంతం ప్రకారం సినిమాలు చేసుకుంటూ వస్తుననాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. మొదటి నుంచి కూడా కల్యాణ్ రామ్ కథల విషయంలో కొత్తగానే ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించడం వల్ల తనకు సక్సెస్ రాకపోయినా.. హీరోగా తనకంటూ  ఓ కొత్త ఇమేజ్ ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు కల్యాణ్ రామ్. ఈ మధ్య కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార  చాలా కాలం తరువాత ఆయనకు బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందించింది. ఈసినిమాతో ఆయన చేసిన ప్రయోగం ఫలించింది. అటు హీరోగా .. నిర్మాతగా ఈ సినిమా ఆయనకి భారీ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. 

ఇక ఆ జోష్ తోనే కల్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ కు రెడీ అవుతున్నాడు. అయితే ఈలోపు  కల్యాణ్ రామ్ మరో సినిమాతో ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. ఈసినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. కెరియర్ పరంగా కల్యాణ్ రామ్ కి  ఇది 19వ సినిమా. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ కంప్లీట్ అయ్యిందట. ఇక ఇందులో మరో విశేషం ఏంటీ అంటే.. నందమూరి హీరో ఇందులో మూడు పాత్రల్లో నటించబోతున్నాడట. 

రీసెంట్ గా గోవా షెడ్యూల్ ను పూర్తిచేసిన టీమ్, చివరి షెడ్యూల్ షూటింగుకి రెడీ అవుతున్నారు టీమ్. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూడు పాత్రల మధ్య వేరియేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. కల్యాణ్ రామ్ ఇలా మూడు పాత్రలను పోషించడం ఇదే మొదటిసారి. ఈ మూడు పాత్రలు కూడా దేనికదే ప్రత్యేకతను సంతరించుకుని ఆకట్టుకుంటాయని అంటున్నారు. 

ఈ సినిమా కథ ప్రకారం టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు  ఎమిగోస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. దాదాపుగా ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. ఈ సినిమాతో మరో హిట్టు ఎలాగైనా కొట్టాలని చూస్తున్నాడు కల్యాణ్ రామ్. చాలా కాలం పెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ నందమూరి హీరోకు మంచిరోజులు వచ్చాయని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios