షూటింగ్ లో నందమూరి కల్యాణ్ రామ్ కు గాయాలు

షూటింగ్ లో నందమూరి కల్యాణ్ రామ్ కు గాయాలు

నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ హీరోగా మహేష్‌ కోనేరు సమర్పణలో వస్తోన్న సినిమా ప్రస్థుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో... తమన్నా కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్‌ కోనేరు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా గురువారం ఈ చిత్రం షూటింగ్‌ వికారాబాద్‌లో జరుగుతుండగా కల్యాణ్‌రామ్‌కు గాయమైందట. ఈ విషయాన్ని చిత్ర స‌మ‌ర్ప‌కుడు మహేష్‌ కోనేరు ట్విటర్‌ ద్వారా తెలిపారు.

 

కల్యాణ్‌రామ్‌ గాయపడినప్పటికీ షూటింగ్‌కు విరామం చెప్పకుండా సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు. అంతేకాదు పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని శుక్రవారం షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. వృత్తిపట్ల ఆయనకి ఉన్న అంకితభావానికి హ్యాట్సాఫ్‌ చెప్పారు. కల్యాణ్‌రామ్‌ ఇటీవల ‘జై లవకుశ’ చిత్రంతో నిర్మాతగా మంచి హిట్‌ అందుకున్నారు.

 

దీంతోపాటు కళ్యాణ్ రామ్ ‘యం.ఎల్‌.ఎ’ (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలోనూ  హీరోగా నటిస్తున్నారు.ఇందులో ఆయన సరసన కాజల్ హిరోయిన్. ఉపేంద్ర మాదవ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos