తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
బింబిసార లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ జోరు పెంచారు. వరుస చిత్రాలు చేస్తున్నారు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ చిత్రాలపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఆ క్రమంలో చివరగా విడుదలైన అమిగోస్ చిత్రం షాకిచ్చింది. అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టింది.
తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బింబిసార తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తో ఆమెకి రెండో చిత్రం. కాగా నేడు కళ్యాణ్ రామ్ తన 45వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా డెవిల్ చిత్ర యూనిట్ టీజర్ ని బర్త్ డే కానుకగా అందించింది. డెవిల్ టీజర్ అదిరిపోయింది అనే చెప్పాలి. బ్రిటిష్ నేపథ్యంలో పీరియడ్ స్పై డ్రామాగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. బ్రిటిష్ వారికోసం పనిచేసే సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ విశ్వరూపం చూపిస్తున్నాడు.
'మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు. మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అదే అంటూ కళ్యాణ్ రామ్ ఇంటెన్స్ గా చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్, గంభీరత్వం, యాక్షన్ సీన్స్ లో అతడి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే విశ్వరూపం ప్రదర్శించినట్లు ఉన్నాడు.

అసలు బ్రిటిష్ వారు డెవిల్ ని సీక్రెట్ ఏజెంట్ గా ఎందుకు నియమించారు. అతడి కర్తవ్యం ఏంటి అనే విషయాలు టీజర్ లో ఉత్కంఠని కలిగిస్తున్నారు. ఓవరాల్ గా డెవిల్ టీజర్ అమేజింగ్ అనే చెప్పాలి. అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
